E-Paper
Advertisement

BMW M2 CS Launched: ఇండియాలోకి BMW M2 CS ఎంట్రీ, పవర్‌ ఫుల్ లగ్జరీ కార్ ధర ఎంతో తెలుసా?

BMW M2 CS Launched: ఇండియాలోకి BMW M2 CS ఎంట్రీ,  పవర్‌ ఫుల్ లగ్జరీ కార్ ధర ఎంతో తెలుసా?
Advertisement

BMW M2 CS Debuts in India: జర్మనీకి చెందిన ప్రీమియం ఆటో మోబైల్ సంస్థ BMW.. భారతీయ కార్ మార్కెట్ లోకి అదిరిపోయే లగ్జరీ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. M2 CSను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ కారు ధరను కంపెనీ  రూ. 1.66 కోట్లుగా నిర్ణయించింది. పూర్తిగా నిర్మించిన యూనిట్‌ గా ఇండియాకు తీసుకొచ్చిన ఈ హై పెర్ఫార్మెన్స్ కూపే పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంటుందని BMW ఇండియా ప్రకటించింది.

BMW M2 CS ఇంజిన్ గురించి..

M2 CSకు 530bhp పవర్, 650Nm టార్క్ ను ఉత్పత్తి చేసే అప్‌ గ్రేడెడ్ 3.0 లీటర్, ఆరు-సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇది ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌తో యాడ్ చేయబడి ఉంటుంది. పవర్ ను రియర్ వీల్స్ కు పంపుతుంది. ఈ కారు 3.8 సెకన్లలో 0 నుండి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 302 కిలో మీటర్లు.

BMW M2 CS డిజైన్ గురించి..

Advertisement

రూఫ్, బూట్ లిడ్, మిర్రర్ క్యాప్స్ లాంటి కార్బన్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ (CFRP) భాగాలను కలిగి ఉంటుంది. ఇది M2 CS సాధారణ M2 కంటే సుమారు 30 కిలోల బరువు తక్కువగా ఉంటుంది. అదే సమయంలో 50bhp ఎక్కువ ఇంజిన్ పవర్ ను కలిగి ఉంటుంది. మెరుగైన ట్రాక్ పనితీరు కోసం, ఇందులో తగ్గించబడిన సస్పెన్షన్ సెటప్,  ప్రత్యేకమైన ఛాసిస్ ట్యూనింగ్ కూడా ఉన్నాయి.

BMW M2 CS ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

BMW M2 CS  బయటి వైపు డక్‌ టెయిల్ స్పాయిలర్, పెద్ద ఎయిర్ ఇన్‌ టేక్‌లు, 19 అంగుళాల ఫ్రంట్, 20 అంగుళాల రియర్ అల్లాయ్ వీల్స్ లాంటి CS ప్రత్యేకమైన స్టైలింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లోపల, క్యాబిన్‌లో M కార్బన్ బకెట్ సీట్లు, అల్కాంటారా అప్‌హోల్స్టరీ, మెరినో లెదర్‌తో పాటు BMW సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉన్నాయి.

Advertisement

Read Also:  సైగలతోనే డోర్లు ఓపెన్.. ఈ మ్యాజికల్ కారు భలే ఉంది గురూ!

అత్యంత వేగవంతమైన కాంపాక్ట్ కారుగా గుర్తింపు

M2 CS, నార్బర్గ్రింగ్ నార్డ్‌ స్క్లీఫ్‌ లో అత్యంత వేగవంతమైన కాంపాక్ట్ కారుగా కూడా గుర్తింపు పొందింది. ఈ ల్యాప్‌ను 7:25.5 నిమిషాల్లో పూర్తి చేసి ఈ ఘటన సాధించింది.

Read Also: ఇది బైక్ కాదు కారు.. లోపల ఎలా ఉందో చూస్తే మతిపోద్ది భయ్యా!

Related News

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×