E-Paper
Advertisement

Mohammad Nawaz Drugs: పాకిస్తాన్ జ‌ట్టులో డ్ర‌గ్స్ క‌ల‌కలం..మహమ్మద్ నవాజ్ కు పాజిటివ్

Mohammad Nawaz Drugs: పాకిస్తాన్ జ‌ట్టులో డ్ర‌గ్స్ క‌ల‌కలం..మహమ్మద్ నవాజ్ కు పాజిటివ్
Advertisement

Mohammad Nawaz Drugs:  పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మరో పెను సంచలనం చోటు చేసుకుంది. నిత్యం వార్తల్లో నిలిచే పాకిస్తాన్ క్రికెట్ జట్టు… ఇప్పుడు డ్రగ్స్ వాడిన కేసులో అడ్డంగా దొరికిపోయింది. పాకిస్తాన్ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ మహమ్మద్ నవాజ్ ( Mohammad Nawaz) డ్రగ్స్ ( drug ) తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఆల్ రౌండర్ మహమ్మద్ నవాజ్ డ్రగ్స్ తీసుకొని మ్యాచ్ ఆడినట్లు ఐసీసీకి స‌మాచారం అందింది. శ్రీలంకలో పాకిస్తాన్ తన పూర్తి మ్యాచ్ లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ డ్రగ్స్ డీలర్ తో ఒప్పందం కుదుర్చుకొని.. ఈ వివాదంలో చిక్కుకున్నాడు మహమ్మద్ నవాజ్. ఇక మహమ్మద్ నవాజ్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఐసీసీ గుర్తించిన‌ నేపథ్యంలో యాక్షన్ లోకి దిగింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీనిపై అధికారికంగా విచారణ ప్రారంభించింది పీసీబీ.

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో డ్ర‌గ్స్ క‌ల‌కలం..మహమ్మద్ నవాజ్ కు పాజిటివ్

Advertisement

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు ఫిబ్రవరిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ కు శ్రీలంకతో పాటు ఇండియా కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా ఛాంపియన్ గా కూడా నిలిచింది. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ కూడా శ్రీలంకలో నిర్వహించారు. అయితే శ్రీలంకలో పాకిస్తాన్ తన ప్రతి మ్యాచ్ ఆడిన నేపథ్యంలో అనేక రకాల వివాదాలలో చిక్కుకుంది. పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన ఓ ప్లేయర్… హోటల్ కు చెందిన ఓ పని మనిషిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అప్పట్లో హల్చల్ చేసింది.

విచార‌ణ ప్రారంభించిన పాక్ బోర్డు

ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నవాజ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. శ్రీలంకలో మ్యాచ్ జరుగుతుండగానే డ్రగ్స్ తీసుకున్నట్లు ఐసీసీ గుర్తించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో సీరియస్ అయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. దీనిపై విచారణ ప్రారంభించింది. ఈ విచార‌ణ పూర్తికాగానే ఐసీసీకి పాకిస్తాన్ బోర్డు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత‌ మహమ్మద్ నవాజ్ పై బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ తరఫున ఆడిన మహమ్మద్ నవాజ్ 7 మ్యాచ్ ల‌లో… 7 వికెట్లు పడగొట్టాడు. 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్లో ముల్తాన్ సుల్తాన్ జట్టు తరఫున మహమ్మద్ నవాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లు తెలితే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కూడా ఆడకుండా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

 

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×