E-Paper
Advertisement

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ మాదే.. నవ్వి పోదురుగాక!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ మాదే.. నవ్వి పోదురుగాక!
Advertisement

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. నిర్మాణం తుదిదశకు చేరుకుంది.ఎయిర్ పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. జూన్ నుంచి ఎయిర్ పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమవుతోంది. మరోవైపు భోగాపురంపై అటు రాజకీయంగానూ కాక రేగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్దయ చర్చే జరుగుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై క్రెడిట్ తమదంటే తమదేనంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటుండటం హాట్‌టాపిక్‌గా మారింది.

ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరిది?

ఉత్తరాంధ్రకు దిక్సూచిగా మారబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు అనుకున్నదానికంటే స్పీడ్ గా సాగుతున్నాయి. 2026 జూన్ నాటికి భోగాపురంలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలన్న కూటమి ప్రభుత్వ టార్గెట్ ను రీచ్ అయ్యేలా పనులు సాగుతున్నాయి . ఇప్పటికే 94 శాతం పనులు పూర్తి చేసుకుంది . ట్రైల్ రన్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది . దీంతో విమానయాన సంస్థలతో మాట్లాడి జూన్ నాటికి ఎయిర్‌పోర్టును ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహననాయుడుకూడా ప్రకటించారు . ప్రధాని నరేంద్ర మోడీ ని తీసుకొచ్చి గొప్పగా ప్రారంభిస్తామని చెప్పారు.

ఆ క్రెడిట్ జగన్ అన్నదే అంటోన్న వైసీపీ

Advertisement

టెస్ట్ ఫ్లైట్ ను చూసిన ఉత్తరాంధ్ర వాసులు, విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. కూటమి నేతలు కూడా తమ ప్రభుత్వం సాధించిందంటూ కాలర్ ఎగరేస్తున్నారు. అయితే సరిగ్గా టైమ్ చూసి సీన్ లోకి ఎంటర్ అయింది విపక్ష వైసీపీ. ఎయిర్పోర్టు గురించి గొప్పగా నాలుగు ముక్కలు మాట్లాడుకొనే లోపే వైసీపీ అధ్యక్షుడు జగన్ నుంచి కింది స్థాయి నాయకుల వరకూ క్రెడిట్ వార్ ను షురూ చేశాయి. జగన్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని పనులు పూర్తి చేసి దానికి శంకుస్థాపన చేశారని వైసీపీ నేతలు అంటున్నారు.

ఆ ట్వీట్‌తో దుమారం

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్న వేల రాజకీయ రగడ జోరందుకుంది . విమానం వచ్చేటపుడు వెళ్ళేటపుడు ఇంజన్ నుండి ఎంత సౌండ్ వస్తుందో అంతకుమించిన రీ సౌండ్ రాజకీయ నాయకుల నోటి నుండి వస్తుందంటే అతిశయోక్తి కాదు. తామే ఎయిర్ పోర్టు పనులకు శ్రీకారం చుట్టామంటూ క్రెడిట్ వార్ ‌కి తెరలేపింది వైసీపీ. ఉత్తరాంధ్ర ప్రజలు ట్రైల్ రన్ ను పూర్తిగా ఆస్వాదించకముందే వైసీపీ అధినాయకుడు జగన్ భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ మాదే అంటూ ఓ ట్వీట్ తో రాజకీయ దూమరనికి ఆజ్యం పోశారు. దాంతో జగన్‌కి వత్తాసుగా ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం మొదలైంది తమ హయాంలోనే అంటూ రాగం అందుకున్నారు. గత 18 నెలలుగా ఇంటి గడప కూడా దాటని ఉత్తరాంధ్ర వైసీపీనాయకులంతా క్రెడిట్ మాదే అంటూ కోరస్ పాడుతున్నారు. అనుమతులు తెచ్చింది. కోర్టు కేసులు ఎదుర్కొని లైన్ క్లియర్ చేసింది మా నాయకుడు జగన్ అంటూ లేనిపోని చర్చలకు తెరలేపుతున్నారు.

టీడీపీ ఎదురు దాడి

Advertisement

చిన్న గ్యాప్ ఇచ్చి అధికార టీడీపీ నేతలు వైసీపీపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్ వస్తుందా అని జగన్ గతంలో మాట్లాడిన వీడియోలు హైలెట్ చేస్తూ ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బుర్రున్నోడు ఎవరైనా ఎయిర్‌పోర్టుకి ఇంతస్థలం తీసుకుంటారా అని జగన్ అన్న మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు పనులు వైసీపీ హయాంలో 23 శాతం పూర్తిచేశామని నిన్న మొన్నటి వరకు చెప్పిన వైసీపీ .. తామే కట్టేసామంటూ ప్రగల్భాలు పలకడం విజ్ణత లేని మాటలంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తమ విజనరీ లీడర్ చంద్రబాబు ముందు చూపు వలనే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయిందని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలలలోనే 94 శాతం పనులు పూర్తి చేసామంటే అది తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని కుండ బడ్డలుకొడుతున్నారు.

జగన్‌పై సెటైర్లు..

ఏదేమైనా ఎయిర్ పోర్టు పనులు దాదాపుగా పూర్తవుతూ … జూన్ లో ప్రారంభోత్సవం కాబోతున్న వేల ఈ క్రెడిట్ గోలేనటన్నది సామాన్యుని అభిప్రాయం. ఎయిర్‌పోర్టులో స్థానిక యువతకు ఉద్యోగలపై దృష్టి సారిస్తే బాగుంటున్నది వారి వెర్షన్. అదలా ఉంటే రీసెంట్‌గా చీపురుపల్లి లో రైల్ వే బ్రిడ్జ్ పనులు పూర్తయ్యాయి . మంచి రోజు చూసుకోని ప్రారంభోత్సవం చేయాలని స్థానిక ఎమ్మెల్యే కళా వెంటారావు భావించారట. కానీ ఎవరూ ఊహించనంత పని చేసింది వైసీపీ. స్వయానా మాజీ ఎంపి బెల్లాన చంద్రశేఖర్ వెళ్ళి కొబ్బరి కాయ కొట్టి బ్రిడ్జ్ ప్రారంభించేశామని ప్రకటించారు . దీంతో కూటమి నాయకులు ఖంగుతిన్నారు. మరొకవైపు… కొంపతీసి భోగాపురం విమనశ్రయం జగన్ గానీ ప్రారంభించేస్తారా అంటూ పబ్లిక్ సెటైర్లు వేస్తున్నారు. చూడాలి మరి ఈ క్రెడిట్ వార్‌కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో?

Story By: Vamsi, Big Tv

Also Read: గజ్వేల్‌లో గలాటా.. కేసీఆర్‌కు తలనొప్పిగా మారిన డబ్బుల లొల్లి

Related News

సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!

లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!

ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త రూల్స్.. కేంద్రం కొత్త పోర్టల్.. ఇలా అప్లై చేయండి?

జీహెచ్‌ఎంసీలో డబుల్ బిల్లుల భారీ కుంభకోణం.. రూ. 70 కోట్ల నిధులు దారిమళ్లింపు!

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కొండా సురేఖ ఎపిసోడ్‌పై ఏఐసీసీ సంచలన నిర్ణయం!

Big Stories

Advertisement
×