E-Paper
Advertisement

Bangladesh-IPL 2026: బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్ర‌సారాలు బంద్‌..బీసీసీఐకి ఎన్ని కోట్ల న‌ష్టం అంటే

Bangladesh-IPL 2026: బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్ర‌సారాలు బంద్‌..బీసీసీఐకి ఎన్ని కోట్ల న‌ష్టం అంటే
Advertisement

Bangladesh-IPL 2026:  ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఐపిఎల్ ఆడకుండా ముస్తాఫిజుర్‌ రహమాన్ లాంటి ప్లేయర్లపై బ్యాన్ కూడా విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్, ఇండియా మధ్య వైరం ముదిరింది. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రసారాలపై నిషేధం విధించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఐపీఎల్‌ ప్రమోషన్‌, ప్రసారాలపై నిరవధిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బ్యాన్ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ లో ఉన్న బ్రాడ్ కాస్ట‌ర్ల‌కు దేశాలు కూడా ఇచ్చింది సర్కార్.

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

ఐపీఎల్ 2026పై బంగ్లాదేశ్ నిషేధం

Advertisement

హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలికి కౌంటర్ ఇచ్చేలా బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాలు బంగ్లాదేశ్ లో ప్రసారం కాకుండా నిషేధం విధించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో బీసీసీఐకి భారీ స్థాయిలో నష్టం వాటిళ్ల‌నుంది. దాదాపు 5 మిలియన్ల డాలర్ల నుంచి పది మిలియన్ డాలర్ల వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలికి నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. అంటే బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణ‌యం నేప‌థ్యంలో బీసీసీఐకి ఏకంగా రూ.40 కోట్ల నుంచి రూ.80 కోట్లు న‌ష్టం జ‌రుగ‌నుంద‌ట‌.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్న‌మెంట్ పై బంగ్లాదేశ్‌ మెలిక‌లు

భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యవహరిస్తున్న తీరుపై బంగ్లాదేశ్ మరో మెలిక పెట్టింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియాలో జరిగే తమ మ్యాచ్ ల వేదికలు మార్చాలంటూ డిమాండ్ చేస్తోoది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. తమ మ్యాచ్ లు ఇండియాలో కాకుండా శ్రీలంకలో నిర్వహించాలని కోరుతోంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు కూడా లేఖ రాసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. అయితే దీనిపై ఐసీసీ స్పందించలేదు కానీ బీసీసీఐ రియాక్ట్ అయింది. షెడ్యూల్ ఫిక్సయిన తర్వాత వేదికలు మార్చాలంటే అస్సలు కుదరదని స్పష్టం చేస్తోంది. మీ గురించి కాదు మీతో ఆడే ప్రత్యర్థి జట్టు గురించి కూడా కాస్త ఆలోచించాలి.. ఇప్పటికే అన్ని జట్ల హోటల్స్ తో పాటు విమాన టికెట్లు బుక్ అయ్యాయి.. ఇలాంటి నేపథ్యంలో వేదికలు మార్చడం అసాధ్యమని పేర్కొంది బిసిసిఐ.

Advertisement

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

 

 

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×