E-Paper
Advertisement

Harish Rao: కాంగ్రెస్ పాలనలో పతనమైపోతున్న ప్రజాస్వామ్యం: మాజీ మంత్రి హరీష్ రావు

Harish Rao: కాంగ్రెస్ పాలనలో పతనమైపోతున్న ప్రజాస్వామ్యం:  మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement

Harish Rao: రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కాంగ్రెస్ నేతలు కబ్జా చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్టు చేయడాన్ని ఎక్స్ వేదికగా బుధవారం ఖండించారు. క్యాతన్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నదన్నారు.

Also Read: Tomato Pulao: ఇంట్లో కూరగాయలు లేవా? అయితే ఈ స్పైసీ టమాటో పులావ్ చేసుకోండి, టేస్ట్ మామూలుగా ఉండదు!

కాంగ్రెస్ అరాచక వైఖరి

Advertisement

అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అన్నారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నదన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మురుగు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. హంగ్ వచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత భేరం చేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనం అన్నారు.

బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలి

కాంగ్రెస్ నాయకులు దాడికిదిగితే అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదన్నారు. రక్షణ కల్పించక పోగా నిస్సిగ్గుగా కాంగ్రెస్ గూండాలకు కొమ్ముకాయడం కాంగ్రెస్ పాలనలో ప్రజస్వామ్య వ్యవస్థలు పతనమైపోతున్న తీరుకు నిదర్శనం అన్నారు. బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: Harish Rao: బాల్క సుమన్‌ను.. వెంటనే రిలీజ్ చేయాలి.. హరీశ్ రావు డిమాండ్

Related News

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

Big Stories

Advertisement
×