E-Paper
Advertisement

“ఆయా షేర్‌”, వైల్డ్ ఫైర్ అంటూ నితీష్ ను జాకీలు పెట్టి లేపకండి..జియో హాట్ స్టార్ కు వార్నింగ్

“ఆయా షేర్‌”, వైల్డ్ ఫైర్ అంటూ నితీష్ ను జాకీలు పెట్టి లేపకండి..జియో హాట్ స్టార్ కు వార్నింగ్
Advertisement

Trolls On Nitish Kumar Reddy:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (IPL 2026) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఫైట్ జరిగింది. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత దారుణంగా విఫలమై ఓడిపోయింది. హైదరాబాద్ ఓడిపోయిన నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డిని దారుణంగా ట్రోలింగ్ ( Trolls On Nitish Kumar Reddy) చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అప్పట్లో ధోనీకి టెక్నిక్ లేదని విమర్శలు చేసిన నితీష్ కుమార్ రెడ్డి… ఇప్పుడు హైదరాబాద్ జట్టు తరఫున ఎంత మేరకు రాణిస్తున్నాడని నిలదీస్తున్నారు. అలాగే ఇకపైన వైల్డ్ ఫైర్, ఆయా షేర్ అంటూ నితీష్ కుమార్ రెడ్డిని ( Nitish Kumar Reddy)) జాకీలు పెట్టి లేపకండి అంటూ జియో హాట్ స్టార్ కు ( Jio Hotstar) కూడా వార్నింగ్ ఇస్తున్నారు హైదరాబాద్ అభిమానులు ( SRH Fans). దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గ‌ర్ల్స్ అంద‌రూ అమ్ముడుపోయేవాళ్లే

జియో హాట్ స్టార్ కు SRH అభిమానులు వార్నింగ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా తెలుగు కురాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తాడని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. మొన్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా కూడా అద్భుతంగా రాణించాడు మనోడు. అయితే నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పైన ప్రభావం చూపిస్తాడు అనుకున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, చెత్త ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్ సందర్భంగా నాలుగవ వికెట్ కు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేశాడు. అద్భుతమైన అవకాశం వచ్చినప్పటికీ ఒకే ఒక పరుగు చేసే ఔట్ అయ్యాడు. అటు బౌలింగ్ లో కూడా మొదటి ఓవర్ వేసే అవకాశం దక్కించుకున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.. అక్కడ కూడా విఫలమయ్యాడు. వేసిన రెండు ఓవర్లలో 19 పరుగులు సమర్పించుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. దీంతో నితీష్ కుమార్ రెడ్డి పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు హైదరాబాద్ అభిమానులు.

నితిష్ కుమార్ రెడ్డిని వ‌దిలేయండిరా బాబు

కిందటి ఏడాది కూడా వైల్డ్ ఫైర్ అంటూ నితీష్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి జియో హాట్ స్టార్ ఓ ప్రోమో రూపొందించింది. నితీష్ కుమార్ రెడ్డిని జాకీలు పెట్టి లేపింది. కానీ కిందటి ఏడాది నితీష్ కుమార్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో టీమిండియా జట్టులో కూడా అవకాశం పెద్దగా గత ఏడాది అతనికి రాలేదు. ఇక ఇప్పుడు కూడా నితీష్ కుమార్ రెడ్డిని జాకీలు పెట్టి లేపేందుకు జియో హాట్ స్టార్ లేపే ప్రయత్నం చేయనుందని ముందే గ్రహించి హైదరాబాద్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. జియో హాట్ స్టార్ కు వార్నింగ్ ఇస్తున్నారు. నాని సినిమాలోని పాట ఆయా షేర్ ను వినియోగించుకొని, కిందటి ఏడాదిలాగా నితీష్ కుమార్ రెడ్డిని లేపకండి.. అంటూ హెచ్చరిస్తున్నారు. మరోసారి అలాగే నితీష్ కుమార్ రెడ్డిని ఆయా షేర్ అంటూ జాకీలు పెట్టి లేపితే.. అట్టర్ ఫ్లాప్ కావడం గ్యారంటీ అంటున్నారు. అందుకే నితీష్ కుమార్ రెడ్డిని వదిలేయండి అని కోరుతున్నారు. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డిని ప్రోమోల పేరుతో జాకీలు పెట్టి లేపితే, జియో హాట్ స్టార్ ను బ్యాన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: IPL telecast in Bangladesh: బిగ్ రిలీఫ్‌..బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై నిషేధం ఎత్తివేత‌..ముస్తాఫిజుర్ రీ-ఎంట్రీ !

?igsh=MXN4YjEya2h5Mmxhdw==

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×