BigTV English

Novak Djokovic: నాపై విష ప్రయోగం జరిగింది.. టెన్నిస్ స్టార్ జోకోవిచ్ సంచలన ఆరోపణ

Novak Djokovic: నాపై విష ప్రయోగం జరిగింది.. టెన్నిస్ స్టార్ జోకోవిచ్ సంచలన ఆరోపణ

Novak Djokovic: సెర్బియా ప్లేయర్, టెన్నిస్ సూపర్ స్టార్ నోవాక్ జోకోవిచ్ సంచలనం ఆరోపణలు చేశాడు. తనపై విష ప్రయోగం జరిగినట్లు పేర్కొన్నాడు. 2022 ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా తనని దేశంలో నుంచి బయటకు పంపించడానికి విషపూరిత ఆహారం ఇచ్చినట్టు {Novak Djokovic} చెప్పాడు. సీసం, పాదరసం కలిసి ఉన్న ఆహారాన్ని ఇచ్చి తనను ఇబ్బంది పెట్టారని జోకోవిచ్ తెలిపాడు.


Also Read: South Africa Sports Minister: అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి.. సౌతాఫ్రికా సంచలన నిర్ణయం !

తనకు పంపించిన భోజనంలో భారా లోహాలైన లెడ్, మెర్క్యూరీలను పెద్ద మొత్తంలో కలపడంతో తాను {Novak Djokovic} తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. మొత్తానికి చావు అంచుల నుంచి బయటపడ్డానని కీలక వ్యాఖ్యలు చేశాడు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ తాను వ్యాక్సిన్ వేసుకోలేదని.. దీంతో ఆస్ట్రేలియన్ అధికారులు తనతో అమానవీయంగా ప్రవర్తించారని {Novak Djokovic} పేర్కొన్నాడు. తాను వ్యాక్సిన్ వేసుకునేందుకు ససేమీరా అనడంతో తనని దేశం నుంచి డిపోర్ట్ చేశారని.. తన విసాని రద్దుచేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడకుండా వెనక్కి పంపేశారని పేర్కొన్నాడు.


2022 ఏడాది జరిగిన ఘటన గురించి తాజాగా ఓ మ్యాగ్జీన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో {Novak Djokovic} ఈ విషయాలను వెల్లడించాడు జోకోవిచ్. ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆడేందుకు ఎంత పోరాడినా ఫలితం దక్కలేదన్నాడు. కోవిడ్ టీకా వేసుకోని కారణంగా తనని మెల్ బోర్న్ లోని ఓ హోటల్ లో నిర్బంధించారని, ఆ సమయంలో తీవ్ర అనారోగ్యపరమైన సమస్యలు తలెత్తాయని తెలిపాడు.

అయితే సెర్బియాకు తిరిగి వచ్చిన తర్వాత తనకు {Novak Djokovic} విషపూరిత ఆహారాన్ని ఇచ్చినట్టు గుర్తించానని.. కానీ ఆ విషయాన్ని పబ్లిక్ గా చెప్పలేదన్నాడు. ఆ తర్వాత చికిత్స తీసుకొని అందులో నుంచి బయటపడ్డానని తెలిపాడు. అప్పటి ప్రభుత్వంలో తనకు {Novak Djokovic} చాలా ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అంతా సజావుగా ఉన్నాయని తెలిపాడు. మీకు విషపూరిత ఆహారం ఇచ్చారా..? అన్న ప్రశ్నకు “అదొక్కటే మార్గంగా కనిపిస్తుంది” అని వెల్లడించాడు. మొత్తానికి జోకోవిచ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also Read: Shikhar Dhawan: మళ్లీ పెళ్లి చేసుకోవాలనుంది.. శిఖర్ ధావన్ వీడియో పోస్ట్ వైరల్!

ఇక 2023లో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొన్న జొకోవిచ్ విజయతగా నిలిచాడు. ఇక 2024 పారిస్ ఒలంపిక్స్ టెన్నిస్ ఈవెంట్ లో పురుషుల సింగిల్ కేటగిరీలో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ప్రపంచ టెన్నిస్ నే చేయించిన జోకోవిచ్ ఒలంపిక్స్ విజేతగా నిలవడానికి 20 సంవత్సరాల పాటు పోరాడాల్సి వచ్చింది. {Novak Djokovic} తన కెరీర్ లో ఐదవ ప్రయత్నంలో, 37 సంవత్సరాల లేటు వయసులో స్వర్ణ పథకం సాధించాడు. తన కెరీర్ లో 24 గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ గెలిచిన జోకోవిచ్.. ఈ ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొననున్నాడు. ఆదివారం నుండి ఈ టోర్ని ప్రారంభం కానుంది. జోకోవిచ్ 11వ సారి ఈ టోర్నీలో పాల్గొంటున్నాడు.

Related News

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

Big Stories

×