Formula E Race Case: ఫార్ములా ఈ రేసు కేసు దర్యాప్తు జోరుగా సాగుతోంది. ఈ కేసులో రోజుకొకర్ని విచారణ చేస్తోంది ఏసీబీ. లేటెస్ట్‌గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి వంతైంది. శుక్రవారం ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారు. నిధుల బదిలీ వెనుక కీలక సూత్రధారి ఈయనేనని భావిస్తోంది.
ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారమంతా మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూనే తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు ఏ-1, ఏ-2 నిందితులను విచారించారు అధికారులు. ఇవాళ ఏ-3 వంతైంది. హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.
హెచ్ఎండిఏ బోర్డు ఖాతా నుండి నగదు రిలీజ్ చేయడంలో బిఎల్ఎన్ రెడ్డి పాత్ర కీలకంగా భావిస్తోంది ఏసీబీ. ఎఫ్ఈఓకు చెల్లింపులపై ప్రొసీడింగ్స్ పూర్తి చేశారాయన. ఎవరి ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తి చేసి నగదు రిలీజ్ చేశారన్నది అసలు ప్రశ్న. దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
హెచ్ఎండిఏ బోర్డు నుండి బదిలీ అయిన 45.71 కోట్లపై ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఫెనాల్టీ కింద ఐటీ శాఖకు చెల్లించిన రూ. 8 కోట్లుపై ఆరా తీస్తోంది ఏసీబీ. BLN రెడ్డి చేసిన ప్రొసీడింగ్స్ పత్రాలను ముందు పెట్టి విచారి స్తోంది. నిధుల బదిలీ ఆదేశాలు తనవేనని కేటీఆర్ ఏసీబీ ముందు చెప్పినా, ఈ తతంగం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారనేది కీలకమైంది.
ALSO READ: మూడు సార్లు కూల్చినా మళ్లీ మళ్లీ కట్టాడు.. హైడ్రా వదిలిపెడుతుందా?
ఇటు వైపు నుంచి పాయింట్లు రైజ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఒకవేళ కేటీఆర్ చెప్పినట్టుగా మాజీ చీఫ్ ఇంజనీరు సమాధానాలు ఇస్తారా? ఏమైనా మార్చుతారా? అనేది దర్యాప్తులో తేలనుంది. ఇద్దరి సమాధానాలు ఒకేలా ఉంటే ఎవరో ఒకర్ని అదుపులోకి తీసుకోవడం ఖాయమని అంటున్నారు. ఇవాళ్టితో ఈ కేసులో తొలి అంకం పూర్తి కానుంది. ఏమైనా తేడాలున్నట్లు కనిపిస్తే వచ్చే వారం కూడా దర్యాప్తు కంటిన్యూ కానుంది.