BigTV English

Shikhar Dhawan: మళ్లీ పెళ్లి చేసుకోవాలనుంది.. శిఖర్ ధావన్ వీడియో పోస్ట్ వైరల్!

Shikhar Dhawan: మళ్లీ పెళ్లి చేసుకోవాలనుంది.. శిఖర్ ధావన్ వీడియో పోస్ట్ వైరల్!

Shikhar Dhawan: టీమ్ ఇండియా మాజీ స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషాని 2012లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ కంటే ఆయేషా పది సంవత్సరాలు పెద్దది. అయినప్పటికీ కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. ఇది మాత్రమే కాదు ఆయేషాకి అప్పటికే వివాహం జరిగి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. వారిని కూడా ధావన్ స్వీకరించాడు. ఆ తర్వాత ధావన్ ఆయేషా దంపతులకు 2014లో ఓరావర్ పుట్టాడు.


Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం!

ఇలా కొంతకాలం సవ్యంగానే సాగిన వీరి దంపత్య జీవితంలో కలతలు ఏర్పడ్డాయి. 2020 నుండి ఈ జంట విడివిడిగా ఉన్నారు. ఇక ధావన్ నుంచి విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. తన భార్య మానసికంగా వేధిస్తోందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు శిఖర్ ధావన్. ఆయేషా మొదట ధావన్ తో కలిసి ఇండియాలోనే ఉండేందుకు ఒప్పుకుంది. కానీ తన మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని చూసుకునేందుకు ఆయేషా ఆస్ట్రేలియాలోనే ఉండిపోయింది.


ధావన్ తన సొంత డబ్బులతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడంతస్తుల భవనాన్ని తన పేరు మీదికి మార్చాలని ఒత్తిడి చేసింది. అంతేకాకుండా ధావన్ పరువుకు భంగం కలిగించేలా అతని తోటీ క్రికెటర్లకు, బీసీసీఐ, ఐపీఎల్ జట్టు యాజమాన్యానికి తప్పుడు సందేశాలు పంపించింది. తన మొదటి భర్త సంతానమైన కుమార్తెల ఫీజులు, ఇతర ఖర్చులకోసం ధావన్ నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. ఆయేషా ఇలా ధవన్ ని ఇబ్బందికి గురిచేసిందని కోర్టు నిర్ధారణకు వచ్చింది.

దీంతో ఈ జంటకి విడాకులు మంజూరు చేసింది ఫ్యామిలీ కోర్టు. కేసులో ప్రాథమికంగా ఆయేషా క్రూర ప్రవర్తన కారణంగానే విడాకులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ జంట 11 ఏళ్ల వివాహ బంధం రద్దయింది. ఇక 2024 ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన ధావన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. తన అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటూ అప్డేట్స్ షేర్ చేస్తున్నాడు.

Also Read: Vinod Kambli Wife: మా పిల్లల చదువులకోసం సచిన్ డబ్బులు పంపాడు.. వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా

ఈ నేపథ్యంలోనే తాజాగా శిఖర్ ధావన్ చేసిన ఓ వీడియో పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వీడియోలో తన తండ్రి మహేంద్ర పాల్ దగ్గరికి వెళతాడు ధావన్. ఈ సందర్భంగా తన తండ్రితో మాట్లాడుతూ.. “నాన్నా.. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉంది” అని అంటాడు. దానికి కౌంటర్ గా దవన్ తండ్రి.. ” మొదటిసారి పెళ్లి చేసినప్పుడే నీకు హెల్మెట్ పెట్టి చేశాం” అంటూ నీ ముఖానికి పిల్లని ఎవడిస్తాడురా..? అనే అర్థంలో కౌంటర్ ఇస్తాడు. దీంతో శిఖర్ ధావన్ చేసేదేం లేక తన తండ్రి వైపు ఆదోరకంగా చూస్తూ సోఫాలో కూర్చుంటాడు. ఈ ఫన్నీ వీడియోని ధావన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×