E-Paper
Advertisement

Weirdest Run-out: క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. వింత ర‌నౌట్‌.. ఏకంగా హెల్మెట్‌తోనే !

Weirdest Run-out: క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. వింత ర‌నౌట్‌.. ఏకంగా హెల్మెట్‌తోనే !
Advertisement

Weirdest Run-out: క్రికెట్ ఆటలో ప్రతి బాల్ ఓ కీలకపాత్ర పోషిస్తుంది. బ్యాటర్లు బ్యాట్ తో ఎంత రెచ్చిపోయినా.. చివరకు ఏదో ఒక బంతికి అవుట్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి అయితే ఆ ఒక్క బాల్ గెలుపోటములను నిర్ణయిస్తుంది. కొన్నిసార్లు లక్ కలిసి రాకపోవడం వల్ల విచిత్రంగా అవుట్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ విచిత్రమైన విధంగా రన్ అవుట్ అయ్యాడు. ఇందులో ఆ బ్యాటర్ పొరపాటు ఏమీ లేనప్పటికీ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

Also Read: Virat Kohli: కోహ్లీకి బిగ్‌ షాక్‌.. అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట !

Advertisement

ఈ రనౌట్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా – ఇంగ్లాండ్ అండర్ – 19 జట్ల మధ్య యూత్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ 30.4 ఓవర్ వద్ద ఇంగ్లాండ్ బ్యాటర్ క్రీజ్ లో ఉన్నాడు. ఈ 30 ఓవర్ ని 16 ఏళ్ల ఎడమ చేతివాటం స్పిన్నర్ జాసన్ రావెల్స్ బౌలింగ్ చేస్తున్న సమయంలో నాలుగవ బంతిని స్వీప్ షాట్ ఆడాడు ఆర్యన్ సావంత్.

ఆ షాట్ కి బాల్ షార్ట్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ జోరిచ్ వాన్ హెల్మెట్ ని తాకి.. తిరిగి మళ్లీ స్టంప్స్ వైపుకు దూసుకు వచ్చి బెయిల్స్ ని పడగొట్టింది. అప్పటికే ఆ షాట్ ఆడిన ఆర్యన్ సావంత్ రన్ కోసం క్రీజ్ బయట ఉన్నాడు. అలా బంతి బెయిల్స్ ని పడగొట్టడం వల్ల సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు రనౌట్ కి అప్పీల్ చేశారు. అయితే బంతి మొదట ఫీల్డర్ జోరిచ్ హెల్మెట్ ని తాకిందని అంతా భావించారు.

Advertisement

కానీ రిప్లై లో మాత్రం ఆ బంతి ఫీల్డర్ మోకాలిని బలంగా తాకినట్లు కనిపించింది. అలా ఫీల్డర్ కి తాకి బెయిల్స్ ని పడగొట్టడంతో ఆర్యన్ సావంత్ ని రనౌట్ గా ప్రకటించారు. దీంతో బ్యాటర్ సావంత్ ఒక్కసారిగా షాక్ కి గురై కాసేపు అలానే నిల్చుండిపోయాడు. ఇక ఆ బంతి బలంగా తాకడం వల్ల ఫీల్డర్ నొప్పితో అక్కడే కింద పడిపోయాడు. వెంటనే జట్టు సహచరులు అతడికి ఫిజియో చేశారు.

ఈ విచిత్రకరమైన, భయానకమైన సంఘటన క్రీడాభిమానులను కూడా ఆందోళనకు గురిచేసింది. ఒక్క షాట్ రెండు జట్లను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఫీల్డర్ కింద పడి పైకి లేవ లేకపోవడంతో ఆటగాళ్లంతా వెంటనే భయపడి.. వైద్య బృందానికి సంకేతాలు ఇచ్చారు. అయితే అతనికి తీవ్ర గాయాలు కాలేదని, క్షేమంగానే ఉన్నాడని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: DSP Deepti Sharma – DSP Siraj: సిరాజ్‌ తరహాలోనే డీఎస్పీగా మరో టీమిండియా క్రికెటర్‌..!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 299 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా 319 పరుగులు చేసి ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడవరోజు ఇంగ్లాండు తన రెండవ ఇన్నింగ్స్ లో 336 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయి డిక్లేర్ ఇచ్చింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన సౌత్ ఆఫ్రికా 295 పరుగులు చేసి తొమ్మిది వికెట్లను కోల్పోయింది.

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×