Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. రంజీ ట్రోఫీలో కోహ్లీ ఆడుతున్న సమయంలోనే…..స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సంఘటన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం జరిగింది. రంజీ ట్రోఫీలో కోహ్లీని చూసేందుకు… ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం కు ( Arun Jaitley Stadium ) భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. అయితే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం కు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో.. పరిస్థితి అదుపు తప్పింది.
Also Read: DSP Deepti Sharma – DSP Siraj: సిరాజ్ తరహాలోనే డీఎస్పీగా మరో టీమిండియా క్రికెటర్..!
ఈ తరుణంలోనే… ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. అభిమానులు భారీగా తరలిరావడంతో గేటు నంబర్-16 వద్ద పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు. ఈ తొక్కిసలాటలో పలువురు విరాట్ కోహ్లీ అభిమానులకు తీవ్ర గాయాలు అయ్యాయి. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడుతున్న నేపథ్యంలోనే… అరుణ్ జైట్లీ స్టేడియంలో ( Arun Jaitley Stadium ) అందరికీ ఉచితంగా ప్రవేశం కల్పించారు. దీంతో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడి వచ్చారు. ఈ తరుణంలోనే.. క్రౌడ్ ఎక్కువై.. తొక్కిసలాట జరిగింది. అయితే… ప్రస్తుత ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద ఉన్న పరిస్థితి గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా… ఇవాళ్టి నుంచే ఢిల్లీలోని ( Delhi ) అరుణ్ జైట్లీ స్టేడియంలో ( Arun Jaitley Stadium ) రైల్వేస్‌తో మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్ లోనే విరాట్ కోహ్లి ( Virat Kohli )… రంజీ మ్యాచ్ లోకి రీ- ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున తొలిసారిగా కనిపించాడు కోహ్లీ. ఇక 2012 సంవత్సరం తర్వాత… ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లి దేశవాళీ క్రికెట్ ఆడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లీ కనిపిచండంతో.. ఫ్యాన్స్ విపరీతంగా వచ్చారు. కోహ్లీ రాకతో ఢిల్లీ అరుణ్‌జైట్లీ స్టేడియం అభిమానులతో కిటకిటలాడింది. అయితే.. అతిగా ఫ్యాన్స్ రావడంతో.. పరిస్థితి అదుపు తప్పి.. తొక్కిసలాట చోటు చేసుకుంది.
Also Read: Virat Kohli: కోహ్లీ కోసం 2 కిమీ లైన్.. RCB అంటూ నినాదాలు.. గూస్ బంప్స్ రావాల్సిందే!
కానీ ఈ సంఘటను ఢిల్లీ పోలీసులు.. కంట్రోల్ చేశారని సమాచారం. ఇది ఇలా ఉండగా…. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా టీమిండియా విఫలమైంది. దీంతో.. టీమిండియా ప్లేయర్లు అందరూ రంజీ మ్యాచ్ లు ఆడాలని ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. దీంతో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) కూడా రంజీ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్, రాహుల్, ఇలా అందరూ రంజీలు ఆడుతున్నారు. మెడ నొప్పి నుంచి బయటపడిన కోహ్లీ.. ఇవాళ్టి నుంచి రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు.
రంజీ ట్రోఫీలో కోహ్లీ.. స్వల్ప తొక్కిసలాట
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట
అభిమానులు భారీగా తరలిరావడంతో గేటు నంబర్-16 వద్ద పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట
ఈ తొక్కిసలాటలో గాయపడిన పలువురు అభిమానులు https://t.co/kiifwFg2zr pic.twitter.com/my4CLIclRb
— BIG TV Breaking News (@bigtvtelugu) January 30, 2025