DSP Deepti Sharma – DSP Siraj: భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ దీప్తి శర్మ తన చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ పోలీసులు దీప్తి శర్మని {DSP Deepti Sharma} డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ( డీఎస్పీ ) గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగ్రా కి చెందిన దీప్తి శర్మ ఈ ప్రతిష్టాత్మక నియామకాన్ని అందుకున్నారు. అలాగే ఆమెకు మూడు కోట్ల నగదు రివార్డుని కూడా అందజేశారు.
Also Read: Shardul Thakur: చరిత్ర సృష్టించిన శార్దూల్.. తొలిసారి హ్యాట్రిక్ !
ఈ మేరకు ఆ రాష్ట్ర డిజిపి ప్రశాంత్ శర్మ.. దీప్తి శర్మ {DSP Deepti Sharma} ను సత్కరించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ పోస్టుతో తన చిన్ననాటి కల నెరవేరిందని సోషల్ మీడియా వేదికగా తెలిపింది దీప్తి శర్మ. తన కళ నెరవేరడంలో తన కుటుంబం యొక్క మద్దతు ఎంతగానో ఉందని పేర్కొంది. ఇక ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024 జట్టులో.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళా జట్టు స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ {DSP Deepti Sharma} టీమ్ లో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే.
2024లో 13 వన్డేలు ఆడిన దీప్తి శర్మ.. 186 పరుగులు చేయడంతో పాటు 24 వికెట్లు పడగొట్టి {DSP Deepti Sharma} ఈ జట్టులో చోటు సంపాదించింది. ఇక క్రీడాకారులలో తాజాగా ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్పీగా పదవిని కేటాయించిన విషయం తెలిసిందే. రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలంపిక్ క్రీడాకారిని జరీన్ కి తెలంగాణ పోలీస్ విభాగంలో పదవిని కేటాయించారు.
మరోవైపు టీమ్ ఇండియా క్రికెటర్ మహమ్మద్ షమీ కూడా ఇటీవల డిఎస్పీగా విధుల్లో చేరారు. అయితే ఇప్పటివరకు పోలీసు శాఖలో డిఎస్పీలుగా చేరిన క్రీడాకారుల విషయానికి వస్తే.. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ గతంలో పంజాబ్ పోలీసు విభాగంలో డిఎస్పీగా చేరారు. 2007 టీ-20 వరల్డ్ కప్ హీరో జోగేందర్ శర్మ హర్యానా పోలీస్ విభాగంలో డిఎస్పీగా చేరారు. అలాగే కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్న బాక్సర్ అఖిల్ కుమార్ హర్యానా పోలీస్ విభాగంలో డిఎస్పీగా పనిచేస్తున్నారు.
Also Read: Virat Kohli: కోహ్లీ కోసం 2 కిమీ లైన్.. RCB అంటూ నినాదాలు.. గూస్ బంప్స్ రావాల్సిందే!
భారత స్టార్ స్ప్రింటర్ హిమ దాస్ అస్సాం పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ (డిఎస్పీ) గా చేరారు. 2006లో కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్యం సాధించిన బాక్సర్ జితేందర్ కుమార్ కూడా హర్యానా పోలీస్ విభాగంలో డిఎస్పీగా పనిచేస్తున్నారు. ప్రముఖ రెగ్యులర్ గీత ఫోగట్.. హర్యానా పోలీస్ విభాగంలో డిఎస్పీగా పనిచేస్తున్నారు. ఇలా క్రీడాకారులను పోలీసులు విభాగంలో డీఎస్పీలుగా నియమించడం పట్ల వారి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.