IND VS PAK: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య… యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో… సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్.. వేస్తున్న బాంబులను ఇండియా చాలా దీటుగా ఎదుర్కొంటుందని.. చెబుతున్నారు. అలాగే చైనా నుంచి తీసుకువచ్చిన బాంబులు ఏమాత్రం పనిచేయడం లేదని అంటున్నారు. ఈ దెబ్బకు ఇండియా చేతిలో పాకిస్తాన్… తీవ్రస్థాయిలో దెబ్బతింటుందని సమాచారం అందుతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. తాజాగా హార్దిక్ పాండ్యా.. వీడియో కూడా వైరల్ అయింది.
Also Read: Trolls on Curran’s : ప్రమాదంలో సామ్ కర్రన్ ఫ్యామిలీ.. పాకిస్తాన్ ఉగ్రవాదుల వలలో టామ్ కర్రన్?
పాకిస్తాన్ టీం పై హార్దిక్ పాండ్యా బాంబులు ?
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో… హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాబర్ అజాం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తాడు. అయితే హార్దిక్ పాండ్యా చేతిలో ఉన్న బంతి స్థానంలో బాంబును పెట్టి… పాకిస్తాన్ ప్లేయర్ ను పెల్చేస్తారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ వీడియోస్ సందర్భంగా బాబర్ అజాం బ్యాటింగ్ చేస్తాడు. అయితే ఆ సమయంలో… హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడు. కానీ కొంతమంది ఆ బంతి ప్లేస్ లో… బాంబును క్రియేట్ చేసి… పాకిస్తాన్ ఆటగాడిపై వేసినట్లు వీడియోను తయారు చేశారు. దీంతో ఆ ఫన్నీ బాంబు పేలి… బాబా అజం మొత్తం కాలిపోతాడు. ఇప్పుడు యుద్ధం లో కూడా… అదే జరుగుతుందని మీనింగ్ వచ్చేలా ఈ వీడియోని క్రియేట్ చేశారు. పాకిస్తాన్ వదులుతున్న బాంబులను s400 అలాగే ఆకాష్ అద్భుతంగా అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిసారి పాకిస్తాన్ పై ఇండియా పై చేయి సాధిస్తుంది. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా బాంబులు వేసినట్లు సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేస్తున్నారు.
రాహుల్ ద్రావిడ్ వర్సెస్ అక్తర్ యుద్ధం
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో మరో పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో రాహుల్ ద్రావిడ్ టెస్ట్ బ్యాటింగ్ అంటే అందరికీ చిరాకు పుడుతుంది. ఇప్పుడు అదే ఫోటోను వైరల్ చేస్తున్నారు. పాకిస్తాన్ బౌలర్ అక్తర్ చాలా దూరం నుంచి పరిగెత్తి, బౌలింగ్ చేస్తూ ఉంటాడు. అంతలా పరిగెత్తిన అక్తర్… బంతిని బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ ద్రావిడ్ మాత్రం… చిన్నగా బ్యాట్ తో అంటిస్తాడు. ఈ నేపథ్యంలో బంతి అక్కడే పడిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ వేసే బాంబులు కూడా అచ్చం అలాగే తయారయ్యాయని.. ట్రోలింగ్ చేస్తున్నారు. రాహుల్ ద్రావిడ్ ను S 400 ఆయుధంతో పోలుస్తున్నారు.
Also Read: SRH vs KKR Tickets : BCCI కీలక ప్రకటన..ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్
?igsh=dW1yMnE4dG84YXAx