BigTV English
Advertisement

SRH vs KKR Tickets : BCCI కీలక ప్రకటన..ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్

SRH vs KKR Tickets : BCCI కీలక ప్రకటన..ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్

SRH vs KKR Tickets :  ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రధానంగా రెండు దేశాలు పరస్పరం మిస్సైల్, డ్రోన్ దాడులు చేసుకుంటున్నాయి. దీంతో భారత్, పాక్ మధ్య అనధికారికంగా యుద్ధం మొదలైనట్టేనని సంకేతాలు వెలువడుతున్నాయి. భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావం ఐపీఎల్ పై కూడా పడింది. ఇరు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఐపీఎల్ ను వారం రోజుల పాటు బీసీసీ వాయిదా వేసినట్టు ప్రకటించింది. ఆటగాళ్ల భద్రత, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. 


Also Read : MS Dhoni: పాకిస్థాన్ తో యుద్ధం… రంగంలోకి MS ధోని !

ఇక ఐపీఎల్ మ్యాచ్ లు వాయిదా పడటంతో ముందే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు ఆయా ఫ్రాంచైజ్ లు టికెట్ డబ్బులు రిఫండ్ వస్తుందని పోస్ట్ చేశారు. తాజాగా ఉప్పల్ స్టేడియంలో రేపటి KKR, SRH మ్యాచ్ కి సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్ త్వరలోనే వస్తుందని పోస్ట్  పెట్టారు.  ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం.. మే 10, 2025న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో KKR, SRH మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ బీసీసీఐ వాయిదా వేయడంతో మ్యాచ్ రద్దు అయింది. దీంతో ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లను బుక్ చేసుకున్న వారిలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఓ పోస్ట్ చేసింది. ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమ్మిన్స్ కెప్టెన్ గా బరిలోకి దిగిన SRH ఈ సీజన్ లో ఇప్పటికే ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించింది. 11 మ్యాచ్ లు ఆడిన హైదరాబాద్ కేవలం మూడు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించి.. 7 మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. గత సీజన్ లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ జట్టు.. రన్నరప్ గా నిలిచింది. హైదరాబాద్ పై ఈ సారి సీజన్ ప్రారంభానికి భారీ అంచనాలున్నాయి.


కానీ అంచనాలు అన్ని ఇప్పుడు పటా పంచలయ్యాయి. అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ తొలి మ్యాచ్ లోనే హైదరాబాద్ ఐపీఎల్ హిస్టరీలో రెండో హయ్యెస్ట్ స్కోర్ సాధించి దుమ్మురేపింది. కానీ ఆ తరువాత నుంచి హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. ఇక ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్  జట్లు చెత్త ప్రదర్శన కనబరిచాయి. దీంతో ఈ జట్లు ప్లే ఆప్స్ అవకాశాలను కోల్పోయాయి. మరోవైపు ఐపీఎల్ వారం రోజుల పాటు వాయిదా పడినా ఎప్పుడూ ప్రారంభమవుతుందో మాత్రం తెలియదు. భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండిస్ క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్ల భద్రత పై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీ ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ విదేశీ ప్లేయర్, సపోర్టింగ్ స్టాప్ మెంబర్ వారి దేశానికి తిరిి వెళ్తారని.. వారికి అన్ని రకాలుగా సహాయం చేస్తామని తెలిపారు.

Tags

Related News

IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

IPL 2026: చెన్నైలోకి సంజు.. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు కొత్త కెప్టెన్ ఎవ‌రంటే ?

Shubman Gill: ఫ్రెంచ్ మోడల్ తో శుభ్‌మ‌న్ గిల్ సహజీవనం..షాకింగ్ ఫోటోలు ఇదిగో!

Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

Big Stories

×