BigTV English
Advertisement

Trolls on Curran’s : ప్రమాదంలో సామ్ కర్రన్ ఫ్యామిలీ.. పాకిస్తాన్ ఉగ్రవాదుల వలలో టామ్ కర్రన్?

Trolls on Curran’s : ప్రమాదంలో సామ్ కర్రన్ ఫ్యామిలీ.. పాకిస్తాన్ ఉగ్రవాదుల వలలో  టామ్ కర్రన్?

Trolls on Curran’s :  ప్రముఖ క్రికెటర్లు సామ్ కర్రన్, టామ్ కర్రన్ ఇద్దరూ సోదరులనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాళ్లు. సామ్ కర్రన్ ప్రస్తుతం ఐపీఎల్ లో క్రికెట్ ఆడుతుంటే.. టామ్ కర్రన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఆడుతున్నాడట. లాహోర్ తరపున పీఎస్ఎల్ లో ఆడుతున్నాడు.  అక్కడ దాడులు జరుగుతున్న నేపథ్యంలో అతని పరిస్థితి పై గందరగోళం నెలకొంది. ముఖ్యంగా పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు తొలుత భారత్ లోని పహల్గామ్ లో దాడి చేసి 28 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. దానికి కౌంటర్ గా భారత్ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేస్తోంది. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం అయ్యారని తెలిపారు.


Also Read :  Sania Mirza : పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సానియా మీర్జా… ఇక మీకు నరకమే అంటూ

మరోవైపు పాకిస్తాన్ కూడా పూంచ్ వద్ద పౌరుల కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ జవాన్ మరణించాడు.  ఇక భారత్ లోని కాశ్మీర్ సరిహద్దు పై పాక్ వైమానిక దాడులు ప్రారంభించడంతో ఇంగ్లండ్ క్రికెటర్లు పీఎస్ఎల్ కోసం పాక్ లో ఉండాలా..?వద్దా అనే సందిగ్దంలో పడిపోయారట. ఈ వివాదం రెండు దేశాల మధ్య యుద్ధంగా మారే అవకాశం కనిపిస్తోంది. పీఎస్ఎల్ లో ఆడుతున్న చాలా మంది ఇంగ్లండ్ క్రికెటర్లు పాకిస్తాన్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితి పై ఈసీబీ ద్వారా అత్యవసర కాల్ సమావేశం కూడా జరిగిందట. ప్రస్తుతం పీఎస్ఎల్ లో టామ్ కర్రాన్, సామ్ బిల్లింగ్స్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, ల్యూక్ వుడ్, టామ్ కోహ్లర్-కాడ్ మోడ్ మోర్ ఇంగ్లండ్ క్రికెటర్లున్నారు. అలాగే కోచ్ లు రవిబోపా, అలెగ్జాండ్రా హార్ట్లీ వంటి వారికి కూడా ఆందోళన నెలకొంది.


పాక్-భారత్ మధ్య యుద్ధం నేపథ్యంలో వీళ్లు పాకిస్తాన్ లోనే ఉంటే ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని ముఖ్యంగా టామ్ కర్రాన్ ఫ్యామిలీ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఓవైపు భారత్, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ పై దాడి చేస్తుండటంతో పాకిస్తానీయులు భయం భయంతో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు భారత్ పై పాకిస్తాన్ కూడా దాడులు చేస్తున్నప్పటికీ భారత్ సైన్యం ఆ దాడులను తిప్పి కొడుతుంది. ఇప్పటికే పాక్ క్షిపణులను, డ్రోన్లను గాలిలోనే పేల్చేసింది భారత్. వాస్తవానికి పాకిస్తాన్ పీఎస్ఎల్ ఎప్పుడైనా ఐపీఎల్ ముగిసిన తరువాత నిర్వహించేది. కానీ ఈసారి కావాలని పోటీకి ఐపీఎల్ జరిగే సమయంలోనే పీఎస్ఎల్ నిర్వహిస్తున్నారు. భారత్-పాక్ మధ్య యుద్ధం వాతావరణం ఉండటంతో పీఎస్ఎల్ మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నట్టు సమాచారం. మరోవైపు భారత్ మాత్రం ఐపీఎల్ ని ఓ వారం రోజుల పాటు వాయిదా వేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. టామ్ కర్రన్ సోదరుడు సామ్ కర్రన్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు.  అయితే పాకిస్తాన్ ఉగ్రవాదుల వలలో టామ్ కర్రన్ ఉన్నాడని సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టడం గమనార్హం.

Related News

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Quinton de Kock : రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని, రీ-ఎంట్రీ ఇచ్చాడు…సెంచ‌రీతో పాకిస్తాన్ ను చిత్తు చేశాడు

Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

Big Stories

×