BigTV English

OTT Movie : ఏలియన్ ను చేరదీసే ముసలాడు… క్లైమాక్స్ లో అదిచ్చే ట్విస్ట్ కు ఫ్యూజులు అవుట్

OTT Movie : ఏలియన్ ను చేరదీసే ముసలాడు… క్లైమాక్స్ లో అదిచ్చే ట్విస్ట్ కు ఫ్యూజులు అవుట్

OTT Movie : ఇప్పటివరకూ ఏలియన్స్ ని చూడకపోయినా, వాటి గురించి మాత్రం రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఎన్నో పరిశోధనలు కూడా చేస్తున్నారు. ఏదో ఒక గ్రహంలో ఏలియన్స్ ఉంటాయని నమ్ముతున్నారు శాస్త్రవేత్తలు. సినిమాలలో మాత్రమే వీటిని చూస్తూ మనం  ఆనందిస్తున్నాము. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో, ఒక ఏలియన్ భూమి మీద చిక్కుకుపోతుంది. ఆ తరువాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

మిల్టన్ పెన్సిల్వేనియాలోని ఒక చిన్న పట్టణంలో ఒంటరిగా, సాధారణ జీవితం గడుపుతుంటాడు. అతని రోజువారీ జీవితంలో సిటీ కౌన్సిల్ మీటింగ్‌లకు హాజరు కావడం, తన కూతురు డెనిస్ నుండి ఏదైనా సహాయం పొందడం వంటివి ఉంటాయి. ఒక రోజు, ఒక UFO అతని ఇంటి వెనుక గార్డెన్‌లో కూలిపోతుంది. దాని నుంచి నీలి రంగు ఏలియన్ ఒకటి బయటకు వస్తుంది. ఇది కళ్ళారా చూసిన మిల్టన్ తన కూతురికి చెప్పి, పోలీసులను సంప్రదించమని చెప్తాడు. కానీ ఎవరూ అతని మాటలను పెద్దగా పట్టించుకోరు. ఆ తరువాత మిల్టన్ ఆ ఏలియన్‌ను తన ఇంటిలోనే ఒక అతిథిగా చూసుకుంటాడు. అది ఆపిల్స్ మాత్రమే తింటుందని తెలుసుకుంటాడు. అతని పొరుగువాళ్లు సాండీ, జాయిస్ ఈ ఏలియన్ గురించి తెలుసుకుంటారు. సాండీ దానికి ‘జూల్స్’ అని పేరు పెడుతుంది. జూల్స్ తన స్పేస్‌షిప్‌ను రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ దానిని రిపేర్ చేయడానికి మరికొంత సమయం పడుతుంది. ఇదిలా ఉండగా మిల్టన్‌కు మతిమరుపు సమస్యలు ఉన్నాయని డెనిస్ భయపడుతుంది. అతన్ని ఒక డాక్టర్ వద్దకు కూడా తీసుకెళ్తుంది.


మరోవైపు సాండీ ఒక యువకుడిని ఫెస్టివల్ సందర్భంగా, తన ఇంటికి ఆహ్వానిస్తుంది. కానీ అతను ఆమె ఆభరణాలు దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె పోలీసులకు ఫోన్ చేస్తాననడంతో, అతను ఆమెను గొంతు నులిమి చంపడానికి ప్రయత్నిస్తాడు. జూల్స్ తన శక్తులతో, ఆ యువకుడి తలను పేల్చివేసి సాండీని కాపాడుతుంది.  జూల్స్‌కు తన స్పేస్‌షిప్ రిపేర్‌కు ఏడు చనిపోయిన పిల్లులు అవసరమని వీళ్ళకు  తెలుస్తుంది. వారు వీధుల్లో చనిపోయిన పిల్లుల కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో వాళ్ళు పోలీసుల దృష్టిలో పడతారు. చివరికి జూల్స్ తన స్పేస్ షిప్ ని రిపేర్ చేసుకుంటుందా ? జూల్స్ కు కావాల్సిన పిల్లులు దొరుకుతయా ? పోలీసులకు జూల్స్ గురించి తెలుస్తుందా ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : చూస్తుండగానే తుడిచి పెట్టేసే సునామీ… మిస్ అవ్వకుండా చూడాల్సిన సర్వైవల్ థ్రిల్లర్

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘జూల్స్’ (Jules). 2023 లో విడుదలైన ఈ మూవీకి మార్క్ టర్టిల్‌ టాబ్ దర్శకత్వం వహించారు. ఇందులో బెన్ కింగ్స్లీ, హ్యారియెట్ సన్సోమ్ హారిస్, జో వింటర్స్, జేడ్ క్వాన్, జేన్ కర్టిన్ వంటి నటులు నటించారు. ఈ మూవీ మిల్టన్ రాబిన్సన్ అనే 79 ఏళ్ల వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×