E-Paper
Advertisement

Pak Squad-T20 World Cup 2026: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 నుంచి పాక్ ప్లేయ‌ర్ ఔట్..ఇక గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్‌ ?

Pak Squad-T20 World Cup 2026: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 నుంచి పాక్ ప్లేయ‌ర్ ఔట్..ఇక గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్‌ ?

Pak Squad-T20 World Cup 2026: పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టి20 ప్రపంచ కప్ ( T20 World Cup 2026 ) ప్రారంభానికి నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకు సంబంధించిన స్టార్ ఆటగాడు గాయం బారినపడ్డాడు. దీంతో పాకిస్తాన్ అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇంతలా ఫ్యాన్స్ టెన్షన్ పడడానికి కారణం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ వెన్నుముక లాంటి బౌలర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi ) గాయపడడం. బిగ్ బాష్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా షాహీన్ అఫ్రిది గాయం బారిన పడ్డాడు. దీంతో ఆ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న షాహీన్ అఫ్రిది, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడటం కష్టమని అంటున్నారు. దీంతో పాకిస్తాన్ అభిమానులు ఉలిక్కి పడుతున్నారు. అతడు లేకపోతే వరల్డ్ కప్ గెలవడం కష్టమే అని పోస్టులు పడుతున్నారు.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

షాహీన్ అఫ్రిదిని ఆఫ్రిదికి గాయం.. టి20 వరల్డ్ కప్ నుంచి ఔట్?

టి20 ప్రపంచ కప్ ( T20 World Cup 2026 ) కంటే ముందు పాకిస్తాన్ కు సంబంధించిన ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది గాయం బారిన పడ్డాడు. మోకాలి గాయం కారణంగా బిగ్ బాష్ లీగ్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అతడు కోలుకొని టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడడం అనుమానమే అంటూ క్రీడా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో 2021-22 సమయంలో కూడా మోకాలి సర్జరీ కారణంగా నెల రోజులపాటు ఆటకు దూరమయ్యాడు షాహీన్ అఫ్రిది. ఇక ఇప్పుడు మరోసారి అతనికి గాయం కావడం పాకిస్తాన్ కు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది. ఆ గాయం తీవ్రత ఎక్కువైతే టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటుకు అతడు దూరమవుతాడని భయపడుతున్నారు. షాహీన్ అఫ్రిది లాంటి స్టార్ ప్లేయర్ జట్టులో లేకపోతే పాకిస్తాన్ గెలవడం చాలా కష్టమే అంటున్నారు. ముఖ్యంగా ఇండియా పై అతడు లేకుండా పాకిస్తాన్ గెలవడం గగనమే అంటూ టెన్షన్ పడుతున్నారు.

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఎప్పుడంటే

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 7వ తేదీన అంటే వచ్చే నెల నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మార్చి 8వ తేదీ వరకు కొనసాగనుంది. అంటే నెలరోజుల పాటు ఈ టోర్నమెంట్ ఉంటుంది. ఈ మెగా టోర్నమెంట్ లో పాకిస్తాన్ తో పాటు ఇండియా కూడా ఒకే గ్రూపులో ఉన్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య లీగ్ దశ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ టోర్నమెంట్లో సల్మాన్ అఘా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

Related News

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

Big Stories

×