E-Paper
Advertisement

Guntur: పందెం కట్టి పెన్ను మింగిన విద్యార్థి.. ఆ తర్వాత నొప్పితో విలవిల, చివరికి..

Guntur: పందెం కట్టి పెన్ను మింగిన విద్యార్థి.. ఆ తర్వాత నొప్పితో విలవిల, చివరికి..
Advertisement

Guntur: దారుణం.. గుంటూరులో ఒక విద్యార్థి అతి తక్కువ మొత్తానికి పందెం కట్టి, ఊహించని రీతిలో తన ప్రాణాలను ప్రమాదంలో పడేసుకున్నాడు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న మురళీకృష్ణ అనే విద్యార్థి మూడేళ్ల క్రితం అంటే తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో తన స్నేహితులతో కలిసి కేవలం రూ. 50 కోసం పోటీ పడి ఒక పెన్నును మింగేశాడు.

అయితే తన స్నేహితుడు నువ్వు మింగు తర్వాత తను తీస్తా అని చెప్పాడు.. పాపం అది నమ్మిన ఈ విద్యార్థి ఆ సమయంలో పందెం గెలవాలనే తొందరలో చేసిన ఈ పని, కాలక్రమేణా అతనికి తీవ్రమైన అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టింది. ఇటీవల కడుపునొప్పి భరించలేనంతగా పెరగడంతో విషయం బయటపడింది.

Advertisement

సాధారణంగా ఇలాంటి వస్తువులు శరీరంలోకి వెళ్ళినప్పుడు ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది. అయితే, గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) లోని గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య బృందం ఈ సవాలును స్వీకరించింది. విద్యార్థికి ఎటువంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్స (Surgery) అవసరం లేకుండానే, అత్యాధునిక ఎండోస్కోపీ విధానం ద్వారా పెద్ద పేగులో ఇరుక్కుపోయిన పెన్నును అత్యంత చాకచక్యంగా వెలికితీశారు. వైద్యుల అంకితభావం, సమయస్ఫూర్తి వల్ల ఒక యువకుడి ప్రాణం నిలిచింది.

Also Read: న్యూఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యానీ చిచ్చు.. ఒకరు మృతి, 16 మందికి అస్వస్థత

Advertisement

ఈ క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ కుమారుడిని కాపాడినందుకు మురళీకృష్ణ తల్లిదండ్రులు వైద్యులకు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. సరదా కోసం చేసే పందాలు, సాహసాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తాయని, యువత ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×