Pakistan vs Namibia: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Men’s T20 World Cup 2026) భాగంగా ఇవాళ పాకిస్తాన్ ముందు పెను సవాల్ నెలకొంది. ఈ టోర్నమెంట్ లో ఉండాలంటే కచ్చితంగా ఇవాల్టి మ్యాచ్ లో విజయం సాధించాలి పాకిస్తాన్. లేకపోతే బ్యాగులు సదురుకొని, లాహోర్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా గ్రూప్ స్టేజిలో నమీబియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. కొలంబోలోని ప్రముఖ సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ( Sinhalese Sports Club, Colombo) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాకిస్తాన్ వర్సెస్ నమీబియా ( Pakistan vs Namibia) మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ నమీబియా మధ్య మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఉండనుంది. ఇందులో కచ్చితంగా పాకిస్తాన్ గెలవాలి. ఒకవేళ తేడా కొట్టి పాకిస్తాన్ ఓడిపోతే మాత్రం ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు నాలుగు పాయింట్లతో నేరుగా సూపర్ 8లోకి దూసుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చాలా ఆచితూచి ఆడనుంది. నమీబియా పైన కచ్చితంగా గెలవాల్సిన నేపథ్యంలో కీలక మార్పులు జట్టులో చేయబోతోంది పాకిస్తాన్. ఇండియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా విఫలమైన ప్లేయర్లను పక్కన పెట్టేందుకు సిద్ధమైందట.
ఇందులో భాగంగానే మొదటగా బాబర్ ఆజం పైన వేటుపడే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాబర్ స్థానంలో ఫకర్ జమాన్ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే షాహిన్ ఆఫ్రిది స్థలంలో సల్మాన్ మిర్జాను తీసుకుంటున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఆదేశాలు కూడా వచ్చాయట. మరి ఈ భారీ మార్పుల నేపథ్యంలో పాకిస్తాన్ ఎలా రాణిస్తుందో చూడాలి. ఇక అటు నమీబియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో స్టేడియంలో ఫ్రీ ఎంట్రీ ఉందట. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఎవరు కూడా ఆసక్తి చూపించకపోవడంతో ఫ్రీ ఎంట్రీ పెట్టినట్లు రూమర్ బయటకు వచ్చింది.
Pakistan Probable XI: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం/ఫఖర్ జమాన్, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(w), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది/సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్
Namibia Probable XI: జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), JJ స్మిట్, జేన్ గ్రీన్(w), డైలాన్ లీచెర్, రూబెన్ ట్రంప్లెమాన్, విల్లెం మైబర్గ్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మాక్స్ హీంగో
Also Read: IND VS PAK: ఇక పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెలవడం చేతకాక, చివరకు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర
🚨 FREE ENTRY FOR PAKISTAN vs NAMIBIA 🚨
– Sri Lanka Cricket has announced that entry will be completely free for the Pakistan vs Namibia T20 World Cup 2026 match.
– Fans can enter through Gate 5 and Gate 7. pic.twitter.com/3sfrs3YBzi
— Rayham (@RayhamUnplugged) February 17, 2026