Romantic Movie OTT : ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీలను ప్రేక్షకులు క్రేజీగా చూస్తుంటారు. ఈ కంటెంట్ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు అలరించాయి కూడా. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఓ హాలీవుడ్ ట్రయాంగిల్ రొమాంటిక్ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇది థియేటర్లకు వెళ్ళకుండా నేరుగానే ఓటీటీలోకి వచ్చింది. కొన్ని బో*ల్డ్ సీన్స్ ఉన్నందున ఇది పెద్దలు చూడటం మంచిది. వీకెండ్ కి ఫుల్ మజా ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఈ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘లవ్ మీ లవ్ మీ’ (Love Me Love Me). ఇందులో మియా జెంకిన్స్ (జూన్), పెపే బరోసో సిల్వా (జేమ్స్), లూకా మెలుచి (విల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ‘క్రూయల్ ఇంటెన్షన్స్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన రోజర్ కంబుల్ దీనిని తెరకెక్కించారు. స్టెఫానియా ఎస్. అనే రచయిత్రి రాసిన నవల ఆధారంగా ఈ రొమాంటిక్ సినిమా రూపొందింది. ఇది 2026 ఫిబ్రవరి 13న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో విడుదలైంది.
జూన్ అనే అమ్మాయి తన అన్నయ్య చనిపోయిన బాధలో ఉంటుంది. ఆ బాధ నుంచి బయటపడి, కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టాలని ఇటలీలోని మిలన్ నగరానికి వెళ్తుంది. అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చేరుతుంది. అక్కడ ఆమెకు ఇద్దరు అబ్బాయిలు పరిచయమవుతారు. ఒకరు విల్.. అతను చాలా పద్ధతిగా, చదువులో ఫస్ట్ ఉంటూ అందరికీ నచ్చేలా ఉంటాడు. జూన్ మనసు కూడా మొదట్లో అతని వైపు మొగ్గుతుంది. కానీ అదే సమయంలో ఆమెకు జేమ్స్ అనే మరో అబ్బాయి తారసపడతాడు. అతను చాలా కోపంగా, గొడవలు పడుతూ, ఫైటింగ్స్ చేసే బ్యాడ్ బాయ్ టైప్. మొదట్లో జూన్ అతన్ని అసహ్యించుకున్నా, మెల్లగా అతనిలోని మరో కోణాన్ని చూసి ప్రేమలో పడుతుంది. చివరికి ఈ ఇద్దరు అబ్బాయిల మధ్య జూన్ ఎవరిని ఎంచుకుంది? తన గత బాధల నుంచి ఎలా బయటపడింది? అనేదే ఈ సినిమా మిగిలిన కథ.
Read Also : వింతైన విమాన ప్రమాదం… అగ్రరాజ్యం రాజకీయాలను కదిలించే మర్డర్ మిస్టరీ… ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్