E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు నిజం చెప్పిన అవని..దొంగగా మారిన పల్లవి.. లాయర్ ఎంట్రీతో దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు నిజం చెప్పిన అవని..దొంగగా మారిన పల్లవి.. లాయర్ ఎంట్రీతో దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode February 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. అభిరామ్ గారు ఫోన్ చేశారు కానీ ఇప్పటివరకు మళ్ళీ ఫోన్ చేయలేదు రాలేదు అని అవని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే పల్లవి నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని నువ్వు ప్లాన్ చేశావు కానీ ఇలా బెడిసి కొడుతుందని అసలు అనుకోలేదు కదా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావో కొంచమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా అని అవని పల్లవిని తిడుతుంది.. అవని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం వినకుండా అవన్నీ తిడుతూ ఉంటుంది. భానుమతి కూడా పల్లవి చెప్పింది నిజమే కదా ఎందుకు మా ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు అని అంటుంది..

కమల్ వదిన ఏ తప్పు చేయలేదు ఆమె చెప్తే అదే కరెక్ట్ అని అంటాడు.. అవనినీ అందరూ తిడతారు. అక్షయ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అయితే అవని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అభి కి ఏమైంది అని తెలుసుకుంటుంది.. పల్లవి మనిషి అభి దగ్గర ఉన్న వస్తువులను తీసుకోని వెళ్తాడు.. పల్లవికీ ఆ విషయాన్ని చెప్తాడు.. అతని దగ్గర ఏమీ లేవు అని తెలుసుకున్న పల్లవి ఆ కొరియర్ గురించి తెలుసుకొని అక్షయ్ ని ఫాలో అవుతూ హాస్పిటల్ కి వెళుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అక్షయ్ కి అభి పంపించిన లెటర్ లో ఏముందో తెలుసుకోవాలని అవని తెగ ప్రయత్నం చేస్తుంది. కానీ అభికి యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న అవని అక్షయ్ ఇద్దరు కూడా హడావిడిగా ఆ లెటర్ ని చేతిలో పట్టుకొని హాస్పిటల్ కి వెళ్ళిపోతారు.. అయితే అక్కడ అభి పరిస్థితిని చూసిన అవని అక్షయ్ లు ఫీల్ అవుతారు.. నాన్నని ఎవరో మర్డర్ చేయాలని అనుకున్నట్లు అభి చెప్పాడు. వాళ్ల గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. నీకేమో సీసీటీవీ ఫుటేజ్ గురించి చెప్తానని అన్నాడు ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ అయింది ఏంటి వరుసగా ఇలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు.

అవని ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటికీ కారణం నేనే అని అంటుంది. అక్షయ్ కి చక్రధర్ తన తండ్రి అన్న విషయాన్ని చెప్పగానే అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు.. మామయ్య గారికి నేను ఆరోజు ఈ విషయం చెప్పడం వల్లే ఇలా జరిగింది అని అవని అనగానే అక్షయ్ నువ్వు నాకెందుకు చెప్పలేదు అంటే నేనంటే నీకు నమ్మకం లేదు కదా అని అంటాడు.

Advertisement

నిన్ను మీ అమ్మని అందరూ అంతలాగా అవమానిస్తున్నారు కదా అప్పుడే నేను ఈ విషయం గురించి నాకు చెప్తే నేను అందరితో చెప్పేదాన్ని కదా అని అక్షయ్ అనగానే.. ఇలా మీరు తొందర పడే ఆ నిజాన్ని బయటపెడతారని నేను మీకు చెప్పలేదు అని అవని అంటుంది.. మా నాన్న చక్రధర్ అన్న విషయం మాకు తెలుసు అయితే ఆ విషయాన్ని అతను ఒప్పుకోవడం లేదు. మా అమ్మతో పెళ్లి అయినట్లు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మేము ఎన్ని రోజులు ఆగాము. కానీ మామయ్య మాకు న్యాయం చేస్తానని చెప్పి ఆ ఫంక్షన్ ని ఏర్పాటు చేశాడు. అయితే అప్పుడే ఇలా జరిగింది అని అవని బాధపడుతుంది. మరి నాన్నని చక్రధర్ జైల్లో ఉండే చంపాలని అనుకున్నాడా? అసలు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులకు చక్రధర్ కు ఏదైనా సంబంధం ఉందా అనేసి ఆలోచిస్తాడు..

ఇందాకటి నుంచి ఈ లెటర్ నా చేతిలో ఉంది దీని గురించే మనం మర్చిపోయాము. ఇది మీకే వచ్చింది కదా ఇందులో ఫ్రం అడ్రస్ కూడా లేదు ఏంటి ఒకసారి చూస్తారా అనేసి అవని అంటుంది. అక్షయ్ ఆ కవర్ ని ఓపెన్ చేయగానే అక్కడున్న సిస్టర్ డాక్టర్ గారు పిలుస్తున్నారు అని అంటుంది. ఆ కవర్ని అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయినా అక్షయ్ లోపల అభికి ఎలా ఉందో తెలుసుకుంటాడు.. హాస్పిటల్ కి వచ్చినా పల్లవి ఆ కవర్లో ఏముందో తెలుసుకోవాలని అక్కడినుంచి మెల్లగా దాన్ని కొట్టేస్తుంది. సడన్ గా అక్షయ అవన్నీ బయటికి రావడంతో అక్కడ దాక్కుంటుంది. కానీ ఆ కవర్లో ఉన్న పెన్ డ్రైవ్ అక్కడే పడిపోతుంది. బయటికి వచ్చి చూసిన పల్లవి అందులో ఏమీ లేదని సంతోషంగా ఉంటుంది.

ఇక తర్వాత అక్షయ్ మనం ఇప్పుడు చక్రధర్ ని కలవడానికి జైలుకు వెళ్లాలి అని అంటాడు.. ఇప్పుడు మనం వెళ్లి అక్కడికి వాడిని అడగడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా అని అవని ఎంత చెప్తున్నా సరే అక్షయ్ మాత్రం ఒకసారి జైలుకు వెళ్లాలి అని అంటాడు. ఇక తర్వాత పల్లవి స్వీట్ బాక్స్ పట్టుకొని ఇంటికి వస్తుంది. ఇంట్లోని వాళ్ళందరిని పిలుస్తుంది. ఆ స్వీట్స్ ఎందుకు అని అడిగితే గుడికి వెళ్లి దేవుడికి మొక్కుకొని వచ్చాను అని అంటుంది. మావయ్య గారు మన సంతోషాన్ని చూసి ఆయన కూడా లేస్తారు కదా అని అనగానే రాజేంద్రప్రసాద్ చేతులు కదిలిస్తాడు. ఇక అతనిలో కదలికలు మొదలయ్యాయి అని అర్థమవుతుంది..

తర్వాత రోజు ఉదయం అందరూ కూర్చొని ఉండగా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ లాయర్ అక్కడికి వస్తారు.. ఫంక్షన్ జరుగుతున్న రోజు ఉదయం నా దగ్గరికి వచ్చారు. రాజేంద్రప్రసాద్ గారు అని లాయర్ అంటాడు.. అయితే ఆయన తన ఆస్తిని పంపకాలు చేసే విధంగా వీలునామా రాశారు అని చెప్తాడు.. అందులో 51 శాతం అవని పేరు మీద, మిగిలిన ఆస్తినంతా తన కూతుర్లు కొడుకులు పేరు మీద రాశారు అని చెప్తాడు. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. మావయ్య గారు నా పేరు మీద 80% ఆస్తిని రాశారు అని ఎవరో ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేశారు.. అవి ఫేక్ అని తేలాయి.. మన ఆస్తి వివరాల గురించి ఎవరికో తెలిసే ఛాన్స్ లేదు ఇంట్లోని వల్లే ఎవరో ఇలా రాసి ఉంటారు.. వాళ్ళు ఎవరో నాకు తెలియాలి ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదని అవని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది..

Also Read : అయ్యో.. అమూల్య కోసం ధీరజ్ కన్నీళ్లు..భాగ్యంకు అడ్డంగా దొరికిన సాగర్.. వనజ ఎంట్రీతో షాక్..

ఆస్తిని ఎవరు రాయాలనుకుంటారు అని భానుమతి కూడా ఆలోచిస్తుంది.. నీకు తోడుగా కమల్ నువ్వు ఆ పనిలో ఉండు వదిన వాళ్ళు ఎవరో తెలియాలి సమాధి కట్టేస్తాను అని అంటాడు.. పల్లవి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ నేను చంపపోయింది పల్లవి అని తెలుస్తుందా? అవని పల్లవి గుట్టును రట్టు చేస్తుందా? ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×