BigTV English

Pakistan Vs Canada Highlights: ఎట్టకేలకు కెనడాపై పాకిస్తాన్ గెలుపు.. కెనడాపై 7 వికెట్లతో..

Pakistan Vs Canada Highlights: ఎట్టకేలకు కెనడాపై పాకిస్తాన్ గెలుపు.. కెనడాపై 7 వికెట్లతో..

Pakistan Beats Canada with 7 Wickets in T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. ఆ దేశ ప్రజలకి కొంత సాంత్వన కలిగించింది. న్యూయార్క్ లో జరిగిన మ్యాచ్ లో కెనడాపై గెలిచి గ్రూప్ ఏలో మూడో స్థానంలో నిలిచింది. కొంత పరువు కాపాడుకుంది.


అయితే టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన కెనడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి విజయం సాధించింది.

వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ జట్టు 107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే ఈసారి ఓపెనర్ గా బాబర్  అజామ్ రాకుండా యువ ఆటగాడు సయిమ్ ఆయుబ్ ని పంపించాడు. రిజ్వాన్ తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన సయిమ్ (6) తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన బాబర్ (33) సాధికారికంగా ఆడాడు. రిజ్వాన్ తో కలిసి 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టు స్కోరు 83 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.


దీంతో ఓపెనర్ గా వచ్చిన రిజ్వాన్ బాధ్యతలు తీసుకుని 53 బంతుల్లో 1 సిక్స్, 2 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతేకాదు జట్టుని ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు. చివర్లో షాట్ కొట్టి మ్యాచ్ ముగిద్దామని అనుకుని ఫకర్ జమన్ (4) అవుట్ అయ్యాడు. ఇక ఉస్మాన్ ఖాన్ (2 నాటౌట్) వచ్చి విజయ లాంఛనం పూర్తి చేశాడు. మొత్తానికి 17.3 ఓవర్లలో 3  వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 107 పరుగులు చేసి జయభేరి మోగించింది. కెనడా బౌలింగులో హెలిగర్ 2, గోర్డన్ 1 వికెట్ తీశారు.

Also Read: ఆ నాలుగు పరుగులు.. అంపైర్ పొరపాటు.. బంగ్లాకి గ్రహపాటు..

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కెనడాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ నవనీత్ (4) త్వరగా అవుట్ అయ్యాడు. అయితే మరో ఎండ్ లో ఆరోన్ జాన్సన్ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. 44 బంతుల్లో 4 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. అయితే తనకి ఎవరూ సపోర్ట్ ఇచ్చే వారు రాలేదు. లేకపోతే మంచి భాగస్వామ్యాలు నెలకొనేవి. జాన్సన్ కాకుండా కెప్టెన్ సాద్ బిన్ జాఫర్ (10), కలీమ్ సనా (13) ఇద్దరే రెండంకెల స్కోరు చేశారు. మిగిలినవారందరూ మమ అనిపించారు.

పాకిస్తాన్ బౌలింగులో ఆఫ్రిది 1, నజీమ్ షా 1, అమీర్ 2, రవూఫ్ 2 వికెట్లు పడగొట్టారు.

ప్రస్తుతం కెనడా ఒక మ్యాచ్ గెలిచి, రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ కూడా కెనడాలాగే ఒకటి గెలిచి, రెండు ఓడిపోయింది. తను మూడో స్థానంలో ఉంది.

Related News

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Big Stories

×