UP Man hits train: ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ వ్యక్తిని ట్రైన్ ఢీకొట్టింది. దాద్రికి చెందిన తుషార్ బైక్‌పై ఆదివారం రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తుషార్ బైక్ పై నుంచి జారిపోయి ట్రాక్‌పై పడిపోయాడు. అదే ట్రాక్ పై రైలు వస్తుందని గమనించి బైక్ ను పక్కకు లాగేందుకు ప్రయత్నించాడు. ఇంతలో వేగంగా వచ్చిన ట్రైన్ అతడిని ఢీకొట్టింది.
🚨UP Greater Noida: Major accident at Dadri railway crossing, A youth’s bike got stuck on the railway tracks while trying to cross. pic.twitter.com/720M0KYqiH
— Deadly Kalesh (@Deadlykalesh) October 13, 2025
ఈ ప్రమాదంలో తుషార్ అక్కడికక్కడే మృతి చెందారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఇటీవలి నివేదిక ప్రకారం 2023లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు జరిగాయి. మొత్తం 2,483 కేసుల్లో 1,025 కేసులు యూపీలో జరిగాయి. రైల్వే క్రాసింగ్ ప్రమాదాల్లో యూపీలో అత్యధిక మరణాలను నమోదు అయ్యాయి. మొత్తం 2,242 రైలు ప్రమాదాల్లో 1,007 మరణాలు యూపీలో సంభవించాయి.