Varshini Suresh: సినిమా ఇండస్ట్రీలోనూ లేదా బుల్లితెర పైన నటించే నటీనటులు క్షణం తీరిక లేకుండా వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతూ ఉంటారు. రాత్రి పగలు అని తేడా లేకుండా ఒకచోట నుంచి మరొక చోటకు ప్రయాణాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతుంటారు. ఇలా తీరిక లేకుండా సినిమా షూటింగ్స్ లో పాల్గొనటం వారి ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంటుందని ఎంతో మంది సెలబ్రిటీలు చెబుతూ ఉంటారు. ఇక బుల్లితెర నటీనటులైతే తెలుగు, కన్నడ తమిళ భాషలలో సీరియల్స్ చేస్తూ కూడా బిజీగా ఉంటున్నారు. ఇలా అన్ని భాషలలో ఒకేసారి సీరియల్స్ చేయటం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఇదివరకే పలు సెలబ్రిటీలు వెల్లడించారు.
తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న ఆటో విజయశాంతి(Auto Vijayashanthi) సీరియల్ నటి వర్షిణి సురేష్(Varshini Suresh) సైతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కెరియర్ పరంగా ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలియజేశారు అదే విధంగా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈ సందర్భంగా వర్షిణి సురేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జీ తెలుగులో ఆటో విజయశాంతి సీరియల్ కు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో చేసిన నటి తమిళ అమ్మాయి అనే సంగతి తెలిసిందే. అయితే ఈమె పలు తమిళ్ సీరియల్స్, అలాగే తెలుగు సీరియల్ చేయటం వల్ల ఏమాత్రం గ్యాప్ లేకుండా చెన్నై, హైదరాబాద్ ప్రయాణాలు చేయాల్సి వస్తుందని తెలిపారు.
ఇలా బిజీ షెడ్యూల్ కారణంగా సరైన తిండి నిద్రలేక తాను ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నానని వెల్లడించారు. ఇలా బిజీ షెడ్యూల్ తో పూర్తిగా మెంటల్ ప్రెషర్ తో బాధపడుతున్నానని ఈ సమస్య కారణంగా ప్రతి నెల తాను హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని వెల్లడించారు. అయితే గత కొద్దిరోజుల క్రితం తనకు ఫిట్స్(Fits) కూడా వచ్చాయి అంటూ ఈమె సంచలన విషయాన్ని బయట పెట్టారు. ఇలా ఫిట్స్ రావడంతో కొద్దిరోజుల పాటు హాస్పిటల్ పాలయ్యానని ఈమె షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
ఆటో నడపటం నేర్చుకున్నా..
ప్రస్తుతం ఆరోగ్యపరంగా తనకు మంచిగా ఉందని అయితే వీలైనంతవరకు తాను సరైన సమయానికి తినడం, నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానని తెలిపారు. ఇలా వర్షిని సురేష్ ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే విషయం తెలియగానే అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన ఫిట్నెస్ గురించి అలాగే స్కిన్ కేర్ గురించి కూడా పలు విషయాలను తెలియచేశారు. ఆటో విజయశాంతి సీరియల్ కోసం ఆటో నడపడం నేర్చుకున్నానని అయితే ఒక్క రోజుకే తాను ఆటో నడిపానని వెల్లడించారు. ఇలా ఈ సీరియల్ కి సంబంధించిన విషయాలతో పాటు తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
Also Read: KBC 17: ఇక చాలు ప్రశ్నలు అడగండి.. బిగ్ బీను కించపరిచిన కుర్రాడు…ఇంత అహంకారమా?