BigTV English

Devara Movie Update: ‘దేవర’ను అందుకే మళ్లీ వాయిదా వేస్తున్నారా..? రిలీజ్‌ ఎప్పుడంటే..?

Devara Movie Update: ‘దేవర’ను అందుకే మళ్లీ వాయిదా వేస్తున్నారా..? రిలీజ్‌ ఎప్పుడంటే..?

NTR’s Movie ‘Devara’ Released Postponed..?: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా.. నందమూరి ఆర్ట్స్, యువసుధా క్రియేషన్స్ బ్యానర్స్‌పై నందమూరీ కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. పాన్ ఇండియాల లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైప్ ఆలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. తొలుత దేవర సినిమా మొదటి పార్ట్‌ను ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 10కి వాయిదా వేశారు. తాజాగా, సెప్టెంబర్ 27న  దేవర సినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అదికార ప్రకటన రానుందని సమాచారం.


సెంటిమెంట్ కారణమా..?
జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా సినిమాలు సెప్టెంబర్‌లోనే విడుదలయ్యాయి. తన తొలి చిత్రం స్టూడెంట్ నంబర్ వన్ 2001లో సెప్టెంబర్ 27 విడుదలైంది. తొలి సినిమాతో ఎన్టీఆర్ సూపర్ హిట్ అయ్యారు. ఆ తర్వాత 2016లో ఎన్టీఆర్ మరో చిత్రం ‘జనతాగ్యారేజ్’ కూడా సెప్టెంబర్ 1న విడుదలై హిట్ అందుకుంది. 2017లో సెప్టెంబర్ 21న ‘జైలవకుశ’ విడుదలై తన ఖాతాలో  మరో హిట్ దక్కింది. ఇలా ఈ సినిమాలు సెప్టెంబర్‌లో విడుదలై హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో దేవర సినిమాను కూడా సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సెంటిమెంట్ ప్రకారం ఎన్టీఆర్ మరో హిట్ అందుకుంటారని ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గోవాలో హైలెట్ సీన్స్..
 గోవాలో దేవర సినిమా షూటింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. జూన్ 3న గోవాలో షూటింగ్ ప్రారంభమైంది. అంతకుముందు మార్చిలో కూడా షూటింగ్ చేశారు. అయితే రొమాన్స్ సాంగ్‌తో పాటు మరో హైలెట్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా, గోవాలో దేవర షూటింగ్‌లో టైగర్‌తో పోరాటం చేసే ఎన్టీఆర్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే సినిమాకు హైలెట్‌గా ఉంటుందని మేకర్స్ చెప్పారట. దీంతోపాటు సినిమాలో ఆయుద పూజ నేపథ్యంలో సాగే మరో ఫైట్, సాంగ్ కూడా అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తోంది. ఏదీ ఏమైనా కీలక సన్నివేశాలన్నీ గోవాలో జరుగుతుండడంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది. కాగా, ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా చిత్రీకరణలో నటిస్తారని టాక్.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×