Ban-Burqa: మహిళల వండే ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ మహిళల జట్టుపై అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. మహిళల బంగ్లాదేశ్ జట్టు సభ్యులు బుర్కా ధరించి క్రికెట్ ఆడారని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. టి20 వరల్డ్ కప్ 2024 సందర్భంగా న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్లు బుర్కా ధరించారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవి నిజమేనని చాలామంది నమ్మేస్తున్నారు. అయితే, ఇవాళ బంగ్లా మ్యాచ్ ఉన్న తరుణంలోనే, ఇవాళే ఈ సంఘటన జరిగినట్లు అందరూ ఊహించుకుంటున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
2024 టీ20 ప్రపంచ కప్ దుబాయ్ వేదికగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. గత సంవత్సరం అక్టోబర్ మాసంలోనే ఈ టోర్నమెంట్ నిర్వహించారు. అయితే ఈ టోర్నమెంట్ లో విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై గ్రాండ్ విక్టరీ కొట్టింది న్యూజిలాండ్. అయితే టి20 మహిళల ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ లో భాగంగా లీగ్ దశలో న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరిగి దాదాపు ఏడాది పూర్తయింది. ఇక ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా లీగ్ స్టేజ్ మ్యాచ్ జరుగుతోంది.
దీంతో అప్పటి ఫోటోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. న్యూజిలాండ్ తో మ్యాచ్ సమయంలో బురఖా ధరించి బ్యాటింగ్ చేశారని బంగ్లా మహిళల జట్టుపై దారుణంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది. జెమిని ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ద్వారా ఈ ఫేక్ ఫోటోలను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణ ప్లేయర్లకు బురఖా వేసి ఫోటోలు వైరల్ చేస్తున్నారని తెలుస్తోంది. కానీ ఇది నిజమే అనుకుని, నమ్ముతున్నారు.
బురఖా ( Burka) ధరించి బ్యాటింగ్ చేయడం క్రికెట్ లో ఎక్కడా లేదు. రూల్స్ ప్రకారం, జెర్సీలు ధరించే మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. టెస్టులు అయితే వైట్, వన్డేలు, టీ20లు అయితే కలర్ జెర్సీలు ధరించాల్సి ఉంటుంది. ఏదైనా నిరసన, నివాళులు, దేశ సమగ్రత, క్యాన్సర్ లాంటి వ్యాధులపై పోరాటం చేస్తున్నట్లు చెప్పాలనుకుంటే బ్లాక్ బ్యాడ్జి ధరించాలి. కానీ బురఖా ధరించి బ్యాటింగ్ చేయడం నిషేధం. ఐసీసీ రూల్స్ ఒప్పుకోవు. అలా జరుగడానికి వీలేలేదు. కాబట్టి బంగ్లాదేశ్ మహిళలు బురఖా ధరించి ఆడినట్లు వస్తున్న వార్తలు ఫేక్ అన్నట్లు.
Bangladesh Women's Team.💀 pic.twitter.com/Mew5zDrtss
— Gems of Cricket (@GemsOfCrickets) October 13, 2025