Sai Sudharsan: ఢిల్లీ వేదికగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం దిశగా దూసుకు వెళ్తోంది. ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ ఆల్ అవుట్ అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో బౌండరీ గేటు దగ్గర బర్గర్ తింటూ సాయి సుదర్శన్ ( Sai Sudharsan ) కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మొన్న ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన సాయి సుదర్శన్… రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇవాళ బౌండరీ గేట్ దగ్గర చిన్నపిల్లాడిలా కూర్చొని బర్గర్ తింటూ మెరిసాడు.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies, 2nd Test ) మధ్య టెస్ట్ క్రికెట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతోంది. పాత తరం వారికి ఈ ఫాలో ఆన్ అంటే బాగా తెలుసు. కొంతమందికి ఈ విషయం అస్సలు తెలియదు. మరి దాని వివరాల్లోకి వెళితే.. టీమిండిమా వర్సెస్ విండీస్ జట్లను ఉదాహరణగా తీసుకుంట, టెస్ట్ క్రికెట్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కంటే ప్రత్యర్థి విండీస్ జట్టు 200, అంతకంటే ఎక్కువ పరుగుల వెనుకంజలో పడితే ఫాలో ఆన్ రూల్ వర్తిస్తుంది. ఆ సమయంలో టీమిండియా జట్టు రెండవ ఇనింగ్స్ కు బదులు వెస్టిండీస్ జట్టును మళ్ళీ బ్యాటింగ్ కు పిలిచే అవకాశాలు ఉంటాయి. ఫాలో ఆన్ విధించడం టీమిండియా జట్టు కెప్టెన్ ఇష్టపూర్వకంగా ఉంటుంది. మరోసారి బ్యాటింగ్ చేయకుండా ప్రత్యర్థిని ఓడించగలమని నమ్మకం ఉంటే దీన్ని ఎంచుకుంటారు. అయితే ఫాలో ఆన్ చేధించి మళ్లీ వెస్టిండీస్ లీడ్ పెట్టవచ్చు. ఆ లీడ్ ను మళ్ళీ టీం ఇండియా బ్యాటింగ్ చేసి చేధించాల్సి ఉంటుంది.
ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ జట్టు అద్భుతంగా రాణించింది. మొదటి ఇన్నింగ్స్ లో అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో కోలుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటివరకు అయితే టీమిండియా పై ( Team India ) 94 పరుగుల లీడ్ సంపాదించింది వెస్టిండీస్. 364 పరుగులు చేసిన వెస్టిండీస్ ( West Indies) తొమ్మిది వికెట్లు నష్టపోయింది. మరో వికెట్ కోల్పోతే టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే రెండో ఇన్నింగ్స్ లో ఇద్దరు వెస్టిండీస్ బ్యాటర్లు సెంచరీ చేశారు. షై హోప్ 13 పరుగులు చేయగా జాన్ క్యాంప్ బెల్ 115 పరుగులు చేసి దుమ్ము లేపాడు.
Sai Sudharshan eating burger outside boundary line
Fans Saying "gujrat se nikal jao Csk me jarurat hai" (leave gujrat we need you in csk) pic.twitter.com/sBUAFe8SQT
— Sawai96 (@Aspirant_9457) October 13, 2025