SaW vs BanW: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో తాజాగా బంగ్లాదేశ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా చివరి వరకు కొనసాగింది. రెండు జట్లు తక్కువ స్కోరు చేసినప్పటికీ చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే చివరికి సౌత్ ఆఫ్రికా మూడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టీమిండియాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి దూసుకువెళ్ళింది దక్షిణాఫ్రికా.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం విశాఖపట్నం వేదికగా నిర్వహించారు. వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి, సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ముందుగా ఊహించినట్లుగానే మొదట బౌలింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా చేజింగ్ చేసిన జట్లు మాత్రమే విజయం సాధిస్తున్నాయి.
గడిచిన మూడు మ్యాచ్ ల రికార్డు చూస్తే, ఈ విషయం స్పష్టం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 232 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా కాస్త తడపబడింది. అయినప్పటికీ చివరి వరకు పోరాడి మూడు బంతులు మిగిలి ఉండగా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది దక్షిణాఫ్రికా. అంటే 49.3 ఓవర్లలో దక్షిణాఫ్రికా 7 వికెట్లు నష్టపోయి విజయం సాధించింది.
పాయింట్ల పట్టిక లో టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ జట్టును అత్యంత దారుణంగా ఓడించింది సౌత్ ఆఫ్రికా. ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో ముందుకు.. వెళ్ళింది. అంతకు ముందు మూడో స్థానంలో ఉన్న టీం ఇండియాను వెనక్కి నెట్టింది దక్షిణాఫ్రికా. దీంతో దక్షిణాఫ్రికా ఆరు పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. నాలుగు పాయింట్లు ఉన్న టీం ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. ఇక అటు మొదటి స్థానంలో ఆస్ట్రేలియా జట్టు ఏడు పాయింట్లు నిలిచింది. రెండో స్థానంలో ఇంగ్లాండ్ దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఐదవ స్థానంలో న్యూజిలాండ్ ఉండగా బంగ్లాదేశ్ ఆరో స్థానంలో నిలిచాయి. ఏడో స్థానంలో శ్రీలంక ఉండగా చిట్ట చివరన పాకిస్తాన్ నిలిచింది.