IND VS WI: ఢిల్లీ వేదికగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఇందులో కూడా విజయం దిశగా దూసుకు వెళ్తోంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమికులు కెమెరామెన్ కంటికి చిక్కారు. స్టేడియంలో సాధారణంగా అందమైన అమ్మాయిలు కనిపిస్తే వెంటనే కెమెరా అక్కడికి వెళుతుంది. అయితే ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ లో ఇద్దరు లవర్స్ ఘాటుగా రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఆ సమయంలో స్టేడియానికి సంబంధించిన కెమెరామెన్ మంచి ఫోకస్ పెట్టాడు. దీంతో ఆ జంట వీడియో వైరల్ గా మారింది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు లవర్స్ వీడియో వైరల్ గా మారింది. క్యాప్ పెట్టుకుని వచ్చిన తన ప్రియుడితో తన గర్లఫ్రెండ్ క్యూట్ గా బిహేవ్ చేసింది. అతని చెంపపైన క్యూట్ కొట్టింది. దీంతో అతడు కోపం తెచ్చుకోకుండా, రొమాంటిక్ గా చూస్తూ ఆమె కోపాన్ని చల్లార్చాడు. అనంతరం మెడలు పట్టుసుకుంది. ఆ తర్వాత ఒకరినొకరు హగ్ చేసుకున్నాడు. ఇక వీళ్ల రొమాన్స్ ను కెమెరామెన్ గుర్తించి కెమెరా పెట్టేశాడు. దీంతో వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.
రెండు టెస్టులో ఫాలో ఆన్ ఆడుతుంటే వెస్టిండీస్ జట్టు ఆలౌట్ అయింది. 390 పరుగులు చేసి కుప్పకూలింది. దీంతో టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. మరికాసేపట్లోనే టీమిండియా బ్యాటింగ్ కొద్దిగా ఆ లక్ష్యాన్ని చేదించనుంది. మరో గంటలో మ్యాచ్ ఫినిష్ కూడా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఓపెనర్ క్యాంప్ బెల్ 115 పరుగులతో దుమ్ము లేపగా షై హోప్ 103 పరుగులు చేశారు. అంటే రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ప్లేయర్లు ఇద్దరు సెంచరీలు నమోదు చేశారన్నమాట.
చివరి వికెట్ కు గ్రీవ్స్ ఏకంగా 50 పరుగులు కొట్టగా సీల్స్ 32 పరుగులతో రాణించారు. ఈ నేపథ్యంలోనే 79 పరుగుల భాగస్వామ్యాన్ని రాబట్టారు. అటు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక అంతకు ముందు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 518 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 248 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసింది వెస్టిండీస్. అటు ఇప్పటికే అహ్మదాబాద్ టెస్ట్ లో విజయం సాధించిన టీమిండియా రెండో టెస్ట్ విజయం దిశగా వెళ్తోంది.
Video ❤️https://t.co/93BY6PhRIE
— Honest Cricket Lover (@Honest_Cric_fan) October 13, 2025