Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా ఉంది. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడి వెళ్దామని రోహిత్ శర్మ ప్లాన్ చేసుకున్నాడు. కానీ పరిస్థితులు మాత్రం పూర్తిగా విభిన్నంగా తయారయ్యాయి. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే అతని కెప్టెన్సీ పీకి పరేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో సాధారణ ప్లేయర్ గానే బరిలోకి దిగనున్నాడు రోహిత్ శర్మ. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ సెంటిమెంటు వర్కౌట్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రేయాస్ అయ్యర్ ట్రోఫీని కాళ్ల దగ్గర నుంచి తీసి పైన పెట్టడంతో వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టీమిండియా వన్డే కెప్టెన్సీ తొలగించిన అనంతరం రోహిత్ శర్మ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో నాయకులు చేసినట్లుగానే పిఆర్ స్టంట్స్ చేస్తున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు నెటిజెన్స్. ఇలా సరికొత్త డ్రామాలు ఆడి, ధోని తరహాలోనే ఎక్కువ రోజులు టీమిండియాలో ప్లేయర్ గా రాణించాలని రోహిత్ శర్మ ప్రయత్నాలు చేస్తున్నాడని చురకలు అంటిస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో కూడా పాతుకు పోయేలా ప్లాన్ చేస్తున్నారట రోహిత్ శర్మ.
టీమిండియా యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ అలాగే సంజు శాంసన్ అందరూ కలిసి ముంబైలోని ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లకు అవార్డులు కూడా దక్కాయి. ఇందులో భాగంగానే శ్రేయాస్ అయ్యర్ కు కూడా అవార్డు వచ్చింది. అయితే ఆ అవార్డు తీసుకున్న అనంతరం, టేబుల్ పైన పెట్టకుండా కాళ్ల దగ్గర పెట్టాడు శ్రేయస్ అయ్యర్. ఇది చూసిన రోహిత్ శర్మ వెంటనే రియాక్ట్ అయి దాన్ని టేబుల్ పైన పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను రోహిత్ శర్మ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
ట్రోఫీ అంటే రోహిత్ శర్మకు చాలా గౌరవం అని, దాని వ్యాల్యూ అందరికీ తెలియదని రాసుకొస్తూ పోస్టులు పెడుతున్నారు రోహిత్ శర్మ అభిమానులు. అయితే దీనిపై రోహిత్ శర్మ అంటే పడని వారు కౌంటర్ ఇస్తున్నారు. కావాలనే శ్రేయాస్ అయ్యర్ తో ఫిక్సింగ్ చేసుకొని ట్రోఫీని అలా టేబుల్ పైన పెట్టాడని రోహిత్ శర్మకు కౌంటర్ ఇస్తున్నారు. రోహిత్ శర్మకు అసలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదని, తన భార్య రితికా చెబితేనే టేబుల్ పైన పెట్టాడని మరికొంతమంది అంటున్నారు. మొత్తానికి సెంటిమెంటుకు తినలేపి టీమిండియాలో కొనసాగాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు కౌంటర్ ఇస్తున్నారు. ధోని తరహాలో ముంబై ఇండియన్స్ జట్టులో ఉండాలని రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నారని కూడా అంటున్నారు.
The award that Shreyas Iyer received, he placed it down on the floor, but as soon as Rohit Sharma noticed it, he immediately picked it up and placed it back on the table.🥹❤️
Rohit knows the true value of every award and trophy.🫡 pic.twitter.com/5CL6kQBXPr
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 12, 2025