Pakistan vs Sri Lanka: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చివరి అంకానికి చేరుకుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్లో పాకిస్తాన్ అలాగే శ్రీలంక తలపడ్డాయి. పల్లెకెలే వేదికగా ( Pallekele International Cricket Stadium, Pallekele) జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పోరాడినా ఫలితం దక్కలేదు. ముందుగా చెప్పుకున్నట్లు 147 పరుగుల కంటే ముందు శ్రీలంకను కట్టడి చేయలేకపోయింది పాకిస్తాన్. దీంతో టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. పోతూ పోతూ పాకిస్థాన్ ను కూడా ఇంటికి తీసుకెళ్లింది లంక.
Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శర్మకు ఘోర అవమానం…చెప్పులు చూపించిన యువరాజు
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో పాకిస్తాన్ అధికారికంగా ఎలిమినేట్ అయింది. సెమీ ఫైనల్ లో చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ చేతు లెత్తేసింది. బౌలింగ్, ఫీల్డింగ్ రెండు విభాగాల్లో చెత్త ప్రదర్శన కనబరించారు పాక్ ప్లేయర్లు. సెమీ ఫైనల్ చేరాలంటే 147 పరుగులకు శ్రీలంకను కట్టడి చేయాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం లంకను కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో ఒక గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్ అలాగే శ్రీలంక రెండు జట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి. అదే సమయంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ రెండు జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ తరుణంలోనే 213 పరుగుల టార్గెట్ ను లంక ముందు ఉంచింది పాక్. కానీ 207 పరుగులే చేసిన శ్రీలంక, 5 పరుగుల తేడాతో ఓడింది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Sri Lanka) మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ( Sahibzada Farhan) అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్ లో 60 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు ఫర్హాన్. ఇందులో 5 సిక్సర్లు అలాగే తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. 166 స్ట్రైక్ గ్రేడ్ తో శ్రీలంకకు చుక్కలు చూపించాడు ఫర్హాన్. ఈ తరుణంలోనే విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు ఫర్హాన్. టి20 వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేశాడు. 2014 టీ20 ప్రపంచ కప్ సమయంలో 6 ఇన్నింగ్స్ లు ఆడిన విరాట్ కోహ్లీ 319 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవరు చేరుకోలేదు. కానీ తాజాగా ఫర్హాన్ మాత్రం, బ్రేక్ చేశాడు. ఆరు ఇన్నింగ్స్ లలో 323 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు ఫర్హాన్ ( Sahibzada Farhan). ఈ 2026 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా ఈ రికార్డు నెలకొల్పాడు. దీంతో సోషల్ మీడియాలో ఫర్హాన్ పేరు మారుమోగుతోంది.
Pakistan Eliminated 😂 pic.twitter.com/rz9jI7J1gK
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) February 28, 2026
🚨RECORD ALERT🚨
Pakistan opener Sahibzada Farhan breaks Virat Kohli's record for the most runs in a single T20 World Cup edition. (323 & counting) pic.twitter.com/B9frrqjowI
— CricTracker (@Cricketracker) February 28, 2026