E-Paper
Advertisement

Pakistan Youtuber: ఇండియా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవాలి..న‌ఖ్వీ, PAK ప్లేయ‌ర్లు గుండెలు బాదుకుని ఏడ‌వాల్సిందే

Pakistan Youtuber: ఇండియా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవాలి..న‌ఖ్వీ, PAK ప్లేయ‌ర్లు గుండెలు బాదుకుని ఏడ‌వాల్సిందే
Advertisement

Pakistan Youtuber:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ప్రారంభమైన ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ఇండియాతో పాటు పాకిస్తాన్ చిరు విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఇక ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ జరిగేది డౌట్ గా మారింది. ఇండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటన చేసింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టును దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు అక్కడి అభిమానులు. ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడితే చూడాలని ఉందని, పాకిస్తాన్ కు చెందిన యూట్యూబర్ ( Pakistan Youtuber) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Paul Van Meekeren Trolls Pak: మూడు చెరువుల నీళ్లు తాగించాం, పాకిస్తాన్ ది అస‌లు గెలుపే కాదు..ఇజ్జ‌త్ తీసిన నెదర్లాండ్స్ బౌలర్

ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే చూడాలని ఉంది

Advertisement

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్  ( India Vs Pakistan) మధ్య మ్యాచ్ చూడాలని ఉందని పాకిస్తాన్ కు చెందిన యూట్యూబర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ మ్యాచ్ లో కచ్చితంగా పాకిస్తాన్ ఓడిపోతుందని.. తమ జట్టు ఓడిపోతే కళ్లారా చూడాలని వ్యాఖ్యానించారు. ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi), తమ క్రికెటర్లు అందరూ బోరున ఏడుస్తారని వెల్లడించారు. వాళ్లందరూ గుండెలు బాదుకొని ఏడుస్తే చూడాలని ఉందని సదరు యూట్యూబర్ సంచలన వీడియో పెట్టాడు. అంతేకాదు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారని గూగుల్ జెమినీని కూడా సదరు యూట్యూబ్ అని అడిగాడు. గత రికార్డులు పరిశీలిస్తే ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే కచ్చితంగా పాకిస్తాన్ ఓడిపోతుందని గూగుల్ జెమినీ కూడా వెల్లడించింది. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో పాల్గొంటున్న పాకిస్తాన్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

పాకిస్తాన్ కు మూడు చెరువుల నీళ్లు తాగించిన నెదర్లాండ్స్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మొదట నెదర్లాండ్స్ తో తలపడింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో పడుతూ లేస్తూ గెలిచింది. పాకిస్తాన్ జట్టును ముప్పతిప్పలు పెట్టి మరి ఓడించే ప్రయత్నం చేసింది నెదర్లాండ్స్. కొద్దిలో మిస్సయింది కానీ మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ జట్టు ఓటమిని మూటగట్టుకునేది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఇండియా చేతిలో కచ్చితంగా పాకిస్తాన్ ఓడిపోవాలని పైన పేర్కొన్న యూట్యూబర్ వీడియో పెట్టాడు. బాబర్ లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే పాకిస్తాన్ గెలవడం అసాధ్యమని వెల్లడించారు.

Advertisement

Also Read: Smriti Mandhana Mother: ప‌లాష్ పెద్ద మోస‌గాడు..వాడిపై ప‌గ‌తో నా బిడ్డ ఆడింది, RCB విజ‌యంపై స్మృతి త‌ల్లి పోస్ట్‌ వైర‌ల్

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×