Smriti Mandhana Mother: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026 Tournament) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bengaluru Women) ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట ఈ టోర్నమెంట్ ఫైనల్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ ( Royal Challengers Bengaluru Women vs Delhi Capitals Women) మధ్య జరిగింది. అయితే ఇందులో అద్భుతం గా ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టును ఒంటి చేత్తో గెలిపించింది స్మృతి మందాన. ఈ నేపథ్యంలోనే స్మృతి మందాన ( Smriti Mandhana) తల్లి స్మిత మందాన ( Smita Mandhana) చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. పలాష్ ముచ్చల్ పరువు తీసేలా, స్మిత మందాన పోస్టు పెట్టారు. అతనిపై ఉన్న పగను ఢిల్లీ జట్టు పై తన కూతురు స్మృతి మందాన తీర్చుకుందని అర్థం వచ్చేలా ఓ పోస్ట్ పెట్టి ట్రోలింగ్ చేసింది. దీంతో స్మృతి మందాన తల్లి స్మిత మందాన చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్ గా మారింది. ఇది చూసిన స్మృతి మందాన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. స్మృతి మందాన కంటే ఆమె తల్లి స్మిత మందానకే పగ ఎక్కువ ఉందని అంటున్నారు. పలాష్ గాడి పరువు తీసేలా, పోస్టు పెట్టి ఇచ్చి పడేసింది అని అంటున్నారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ పై రాయల్ చాలెంజర్స్ మహిళల జట్టు ఘన విజయం సాధించిన నేపథ్యంలో స్మృతి మందాన తల్లి స్మిత మందాన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇప్పుడు విభాగంగా మారింది. స్మృతి మందాన తన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ ను ట్రోలింగ్ చేస్తూ ఉన్న ఒక మీమ్ ను ఆమె రీ-పోస్ట్ చేశారు. పలాష్ ముచ్చల్ మోసం చేయడం వల్ల వాళ్ళ పెళ్లి రద్దయిందని చెప్పే ప్రయత్నం చేసింది స్మిత మందాన. అయితే ఈ పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే దారుణంగా కామెంట్లు వచ్చాయి. మళ్లీ వివాదంగా ఈ టాపిక్ మారుతుందని గ్రహించిన స్మృతి మందాన తల్లి, వెంటనే ఆ పోస్టును డిలీట్ చేశారు.