Pakistan On ICC: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ వింత వాదనలను తెరపైకి తీసుకు వస్తోంది. మొదట అసలు ఈ టోర్నమెంట్ ఆడబోమంటూ డ్రామాలు ఆడింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ తరహాలోని టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని ఊరించింది. అయితే చివరి క్షణంలో జెర్సీ లాంచ్ చేసి, ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటుకు సిద్ధమైంది పాకిస్తాన్. ఈ మేరకు కొలంబోకు కూడా చేరుకుంది పాకిస్తాన్ జట్టు. అయితే ఇలాంటి నేపథ్యంలో మరో తిరకాసు పెట్టింది. టోర్నమెంట్ ఆడతాం కానీ, ఇండియాతో జరిగే మ్యాచ్ మాత్రం ఆడబోమంటూ బహిష్కరించింది. దీంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్లు కూడా PCB తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరించిన పాకిస్తాన్… ఇప్పుడు ఐసీసీకి వార్నింగ్ ఇస్తోంది. తమ ఉగ్రవాదులకు సంబంధించిన బాంబులతో ఐసీసీ కార్యాలయాన్ని పేల్చేస్తామని హెచ్చరిస్తోంది. అయితే ఈ హెచ్చరిక చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాదు. పాకిస్తాన్ కు చెందిన ఓ ప్రముఖ యూట్యూబర్. అతడే అర్సలాన్ నసీర్. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ వివాదంపై తాజాగా వీడియో రిలీజ్ చేశాడు అర్సలాన్ నసీర్. ఐసీసీ కార్యాలయం యూఏఈలో కాకుండా, ఇండియాలో ఉంటే, ఆ ఆఫీస్ ను ఇప్పటికే బాంబులతో పాకిస్తాన్ ప్రజలు పేల్చేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు నసీర్. దీంతో అతడు చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ కొత్త కండిషన్
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ రకరకాల డ్రామాలు ప్లే చేస్తోంది. నూటికి ఏది వస్తే అది మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ను రెచ్చగొడుతోంది. బంగ్లాదేశ్ పై వేటు వేసిన ఐసీసీని అలాగే ఇండియాను ఇబ్బంది పెట్టే కుట్రలకు తెరలేపుతోంది పాకిస్తాన్. మొదట ఈ టోర్నమెంట్లో అసలు ఆడబోమని వెల్లడించిన పాకిస్తాన్ క్రికెట్ టీం.. శ్రీలంకలోని కొలంబోకు వచ్చేసింది. ఇక కొలంబోకు వచ్చిన తర్వాత ఇండియాతో జరిగే మ్యాచ్ ఆడబోమని డ్రామాలు ఆడుతోంది. ఆ మ్యాచ్ ఆడాలంటే మళ్ళీ బంగ్లాదేశ్ ను t20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులోకి తీసుకురావాలని కొత్త కండిషన్ పెట్టిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ గొడవలు లేకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన రెండు సంవత్సరాల బ్యాన్ విధించాలని ఇండియన్ ఫాన్స్ కోరుతున్నారు. ఇలాంటి దుర్మార్గులను క్రికెట్ ఆడకుండా ఐసీసీ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ కు డెడ్ లైన్ ఐసీసీ విధించిందట. 48 గంటల్లో ఇండియాతో మ్యాచ్ ఆడడంపై క్లారిటీ ఇవ్వాలని వెల్లడించిందట.
🚨 BACK-UP PLAN OF PAKISTAN PEOPLE 🚨
Pakistan YouTuber said – "If the ICC office was in India instead of the UAE, our people (Pakistan) would have blown it up by now."
What's your take 🤔 pic.twitter.com/f3b2dE1Kik
— Richard Kettleborough (@RichKettle07) February 3, 2026