Mohammad Ali: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) ఫైనల్ దశకు వచ్చేసింది. హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ ( Hyderabad Kingsmen vs Peshawar Zalmi) జట్ల మధ్య ఉత్కంఠ భరితమైన ఫైనల్ మ్యాచ్ రేపు లాహోర్ వేదికగా ఉండనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ కింగ్స్ మెన్ ఆటగాడు మహమ్మద్ అలీ ( Mohammad Ali) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ అద్భుతంగా దూసుకు వెళ్లడం వెనక కారణం రాహుల్ ద్రవిడ్ ( Rahul Dravid ) అంటూ వ్యాఖ్యానించారు.
అతని వల్ల సక్సెస్ లో దూసుకు వెళ్తున్నట్లు ప్రకటన చేశారు. రాహుల్ ద్రవిడ్ గతంలో చెప్పిన మాటలను పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నానని వ్యాఖ్యానించారు. అతని మాటల వల్ల ఇప్పుడు ఓ రేంజ్ లో తాను ఉన్నానని వెల్లడించారు. ఎక్కువగా కష్టపడే వాళ్లకు అదృష్టం ఉంటుందని గతంలో రాహుల్ ద్రవిడ్ చెప్పినట్లు గుర్తు చేశారు. దీంతో ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అందుకే తాను సక్సెస్ అవుతున్నట్లు ప్రకటించారు. ఇస్లామాబాద్ యునైటెడ్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య జరిగిన ఎలిమినేటర్ 2 మ్యాచ్ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ అలీ. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ పై ( Rahul Dravid) పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ అలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల ( Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మార్క్ చాప్మన్ ను టార్గెట్ చేసి బౌలింగ్ చేశాడు మహమ్మద్ అలీ. ఈ క్రమంలో ఇద్దరు మధ్య చిన్నప్పటి గొడవ కూడా జరిగింది. ముందుగా మార్క్ చాప్మన్ ను మహమ్మద్ అలీ గెలికాడు. నోటితో అనలేని బూతులు తిట్టాడు. దీంతో మార్క్ చాప్మన్ (Mark Chapman ) రివర్స్ అయ్యాడు. దీంతో గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఈ క్రమంలోనే ఒకరినొకరు కొట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అంతలోనే అంపైర్ రంగంలోకి దిగి, పరిస్థితిని చక్క దిద్దారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan cricket board) విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. తప్పు చేసిన ఇద్దరిపై PCB యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండగా రొమాన్స్..Ramiz Raja Hugరమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైరల్
Pakistan's Mohammad Ali credits Rahul Dravid for success
"As the great Rahul Dravid said, luck favours those who work hard." pic.twitter.com/q8NJ9tYxQu
— Brutal Truth (@sarkarstix) May 1, 2026