E-Paper
Advertisement

PBKS VS LSG: పంజాబ్ కింగ్స్ కు పాకిస్తాన్ సాయం…పాంటింగ్ నిజంగానే గేమ్ ఛేంజర్, ఇక ప్లే ఆఫ్స్ బెర్త్ ఫిక్స్‌?

PBKS VS LSG: పంజాబ్ కింగ్స్ కు పాకిస్తాన్ సాయం…పాంటింగ్ నిజంగానే గేమ్ ఛేంజర్, ఇక ప్లే ఆఫ్స్ బెర్త్ ఫిక్స్‌?
Advertisement

PBKS VS LSG:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants vs Punjab Kings) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. లక్నో లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్, కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో బయటపడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్, నాలుగో స్థానానికి చేరుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్… ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోతే, పంజాబ్ కింగ్స్ నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకోనుంది. అయితే పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుకోవడం వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

పంజాబ్ కింగ్స్ కు పాకిస్తాన్ సాయం…పాంటింగ్ నిజంగానే గేమ్ ఛేంజర్

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (Australia vs Pakistan) మధ్య ఈనెల 30వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో ఐపీఎల్ ఆడే ప్లేయర్లను వదిలేసిన క్రికెట్ ఆస్ట్రేలియా… కిందిస్థాయి ప్లేయర్లను సెలెక్ట్ చేసింది. ఇందులో భాగంగానే మే 23వ తేదీ అంటే నిన్న ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ లో పర్యటించింది. కెప్టెన్  మిచెల్ మార్ష్ కూడా లక్నో జట్టును వీడి.. నేరుగా పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. నిజానికి లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన నిన్నటి మ్యాచ్ లో మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ఉండాల్సింది. కానీ పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting), క్రికెట్ ఆస్ట్రేలియా పై ఒత్తిడి తెచ్చారట. మిచెల్ మార్ష్ వెంటనే లక్నో ను వదిలి, పాకిస్తాన్ వెళ్లేలా చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా ముందు ఓ గేమ్ ప్లాన్ చేశారట రికీ పాంటింగ్.

దీంతో పంజాబ్ కింగ్స్ తో జరగాల్సిన మ్యాచ్ ఆడకుండానే మిచెల్ మార్ష్ పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. ఈ క్ర‌మంలో పంజాబ్ తో జరిగిన నిన్నటి మ్యాచ్ లో మిచెల్ మార్ష్, ఆడలేదు. అతని స్థానంలో వచ్చిన కులకర్ణి డ‌కౌట్ అయ్యాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లలో వరుసగా అర్ధ సెంచరీలు చేసి మార్ష్ , రెచ్చిపోయాడు. కొన్ని మ్యాచ్ లను గెలిపించాడు. అయితే అతడు నిన్నటి మ్యాచ్ ఆడి ఉంటే లక్నో కచ్చితంగా విజయం సాధించేది. అలా జరిగి ఉంటే పంజాబ్ కింగ్స్ ఇంటిదారి పట్టేది. ఇదంతా జరగకుండా రికీ పాంటింగ్, గేమ్ చేంజింగ్ ప్లాన్ వేశాడని అంటున్నారు.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

 

https://www.facebook.com/share/p/1UKfuCuBKK/

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×