E-Paper
Advertisement

PBKS VS LSG: ఎంతకు తెగించార్రా ? చీర్ లీడ‌ర్స్ కు ఫోన్ నెంబ‌ర్లు రాసి మ‌రీ వేధింపులు

PBKS VS LSG: ఎంతకు తెగించార్రా ? చీర్ లీడ‌ర్స్ కు ఫోన్ నెంబ‌ర్లు రాసి మ‌రీ వేధింపులు
Advertisement

PBKS VS LSG:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న కీలక మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Lucknow Super Giants vs Punjab Kings) మధ్య బిగ్ ఫైట్ చోటు చేసుకుంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన పంజా కింగ్స్, ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ( Shreyas Iyer) 51 బంతుల్లో సెంచరీ నమోదు చేసుకొని, జట్టును ముందుండి నడిపించాడు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ కు పంజాబ్ కింగ్స్ మరింత దగ్గర అయింది. అంతేకాదు ఆరు ఓటముల తర్వాత విజయాన్ని నమోదు చేసుకుంది పంజాబ్ కింగ్స్.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

ఎంతకు తెగించార్రా ? చీర్ లీడ‌ర్స్ కు ఫోన్ నెంబ‌ర్లు రాసి మ‌రీ వేధింపులు

Advertisement

లక్నో వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ LSG మ్యాచ్ సందర్భంగా ఓ వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సంబంధించిన చీర్ లీడర్స్ ను (CHEERLEADERS) కొంత మంది అభిమానులు వేధించారు. చీర్ లీడర్స్ సీటింగ్స్ వెనకాల ఉన్న అభిమానులు దారుణంగా ర్యాగింగ్ చేశారు. అంతేకాదు ఓ అభిమాని బరితెగించి ప్రవర్తించాడు. కరెన్సీ నోట్ పైన ఫోన్ నెంబర్ రాసి ..దాన్ని మ‌డిచి మరి, చీర్ లీడర్స్ పైకి విసిరాడు. ఫోన్ నెంబర్ రాసిన కరెన్సీ నోట్ తనకు తగలడంతో.. ఓ చీర్ లీడర్ చాలా సీరియస్ అయింది.

అక్కడే ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పైకి వేసిన కరెన్సీ నోటును వెతికి మరీ, పోలీసులకు అప్పగించింది. ఈ క్రమంలో ఆ కామాంధుడిని అరెస్టు చేసిన పోలీసులు, స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే దీనిపై క్రికెట్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. ఇండియా పరువు తీసేందుకే ఇలా స్టేడియాలలో చెత్తగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. క్రికెట్ చూడడానికి వెళ్లి రావాలి తప్ప… ఇలా చీర్ లీడర్స్ ను గెలకకూడదని ఆగ్రహిస్తున్నారు.

7 వికెట్ల తేడాతో పంజాబ్ విజ‌యం

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో భాగంగా తన చివరి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. లక్నోపై నిన్న ఏడు వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో లక్నో మొదటి బ్యాటింగ్ చేసి 196 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఛేదించింది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ లో అయ్యర్ సెంచరీ చేయగా.. ప్రబ్ సిమ్రాన్ సింగ్ 69 పరుగులతో రాణించాడు. ఇక లక్నోపై విజయం సాధించిన పంజాబ్ నాలుగో స్థానానికి చేరుతుంది. ఇవాళ ముంబై ఇండియన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే… పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.

 

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

40 ఏళ్ళ రోహిత్ ను తీసుకున్నప్పుడు, షమీని ఉగ్రవాదిలా ఎందుకు ట్రీట్ చూస్తున్నారు ?

కోచ్ వహాబ్ రియాజ్ తో పాకిస్తాన్ లేడీ క్రికెటర్ డేటింగ్…స్టేడియంలోనే రొమాన్స్ !

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్

ఒరేయ్ నఖ్వీ… నీకు ఏది చేతకాదు కానీ, ఆసియా కప్ అయినా దొంగిలించు !

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

Big Stories

Advertisement
×