E-Paper
Advertisement

INDW Vs SLW : నేడు భార‌త్-శ్రీలంక మ‌ధ్య నాలుగో టీ20.. ఈ మ్యాచ్ ని ఎక్క‌డ చూడాలంటే..?

INDW Vs SLW : నేడు భార‌త్-శ్రీలంక మ‌ధ్య నాలుగో టీ20.. ఈ మ్యాచ్ ని ఎక్క‌డ చూడాలంటే..?
Advertisement

INDW Vs SLW :  ప్ర‌స్తుతం భార‌త్ వ‌ర్సెస్ శ్రీలంక ఉమెన్స్ మ‌ధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టికే మూడు మ్యాచ్ ల్లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో సిరీస్ ను కూడా టీమిండియా కైవ‌సం చేసుకుంది. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటిలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. గ‌త మూడు మ్యాచ్ ల్లో కూడా రెండింటిలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు విజ‌యం సాధించింది. ఇప్ప‌టికే విశాఖ‌ప‌ట్ట‌ణంలో రెండు మ్యాచ్ లు, తిరువ‌నంత‌పురంలో ఓ మ్యాచ్ జ‌రిగింది. ఇక నాలుగో టీ 20 కూడా తిరువ‌నంత‌పురం వేదిక‌గా ఆదివారం జ‌రుగ‌నుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ 3-0తో సీరిస్ ను కైవ‌సం చేసుకున్న హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని టీమిండియా.. అదే జోరు కొన‌సాగిస్తూ నాలుగో మ్యాచ్ లో కూడ గెల‌వాల‌ని భావిస్తోంది.

Also Read : SA T20 League 2026 : రికెల్ట‌న్ సెంచ‌రీ వృథా.. డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ బోణీ..!

అద్భుతంగా రాణిస్తున్న భార‌త మ‌హిళ‌లు

Advertisement

గ‌త మూడు మ్యాచ్ ల్లో కూడా భార‌త్ క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ ముందు శ్రీలంక మ‌హిళ‌ల జ‌ట్టు స్వ‌ల్ప స్కోర్ కే ప‌రిమిత‌మైంది. టాప్ ఆర్డ‌ర్ ఫుల్ ఫామ్ లో ఉండ‌టంతో టీమిండియా సునాయ‌సంగా ల‌క్ష్యాల‌ను ఛేదించింది. సూప‌ర్ ఫామ్ లో ఉన్న భార‌త మ‌హిళ‌ల జ‌ట్టును ఎదుర్కోవ‌డం శ్రీలంక మ‌హిళ‌ల‌కు స‌వాలే అనే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా విశాఖ‌లో జ‌రిగిన తొలి రెండు మ్యాచ్ ల్లో, తిరువ‌నంత‌పురంలో జ‌రిగిన ఒక మ్యాచ్ లో భార‌త బ్యాట‌ర్లు, బౌల‌ర్లు స‌మిష్టిగా రాణించారు. స్మృతి మంధాన‌, ష‌ఫాలీ వ‌ర‌మ‌, జెమీమా రోడ్రిగ్స్, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్, రిచాఘోష్, దీప్తి శ‌ర్మ‌తో భార‌త బ్యాటింగ్ ప‌టిష్టంగా ఉంది. బౌలింగ్ లో ఏపీ అమ్మాయి శ్రీచ‌ర‌ణి నిల‌క‌డ కొన‌సాగిస్తుండ‌గా.. రేణుక‌, క్రాంతి, దీప్తి, వైష్ణ‌వి, అమ‌న్ జ్యోతి స‌త్తా చాటుతున్నారు. ఇప్ప‌టికే సిరీస్ ద‌క్క‌డంతో ఈ మ్యాచ్ లో రిజ‌ర్వ్ బెంచ్ బ‌లాన్ని ప‌రీక్షించే అవ‌కాశం ఉంది.

మ్యాచ్ ని ఎక్క‌డ చూడాలంటే..?

పవర్ ప్లే లోనే కీలక వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బ తీసింది. రేణుకా 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. మరోవైపు స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ 3 వికెట్లతో చెలరేగింది. ఈ క్రమంలోనే టీ20ల్లో 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. వీరిద్దరి ధాటికి శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు షఫాలీ వర్మ వీరోచిత ఆరంభాన్ని ఇచ్చింది. మొదటి ఓవర్ నుంచే లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగిన షఫాలీ, మైదానాన్ని బౌండరీలతో హోరెత్తించింది. కేవలం 42 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమె  188.09 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయ‌డంతో శ్రీలంక చిత్తు చిత్తుగా ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్  రాత్రి 7 గంట‌ల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానుంది. ఉచితంగా వీక్షించ‌వ‌చ్చు.

Advertisement

Also Read : Viral Video : క్రికెట్ ఆడిపించుకోలేదని.. గ్రౌండ్ మొత్తం దున్నేసాడు.. వీడియో వైరల్

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×