Jagtial Crime: చూడటానికి కొందరు సాఫ్ట్‌గా ఉన్నా సమయం, సందర్బం వచ్చినప్పుడు రప్పాడించేస్తారు. ఓ యువకుడు చేస్తున్న పనికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు విసిగిపోయారు. పదే పదే బ్లాక్ మెయిల్ చేయడం, వారికి వచ్చిన పెళ్లి సంబంధాలు చెడగొట్టడంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇలాంటి వాడు భూమ్మీద ఉండటానికి వీల్లేదని డిసైడ్ అయ్యారు. ప్లాన్ ప్రకారం అతడ్ని ఆ వ్యక్తిని చంపేశారు. సంచలనం రేపిన ఈ ఘటన జిగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది.