Pratika Rawal Medal : మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025 టైటిట్ ని భారత మహిళా క్రికెట్ జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన భారత మహిళల జట్టుకు ట్రోఫీని అందజేయడంతో పాటు ప్లేయర్లకు కూడా విజేతల పతకాలు అందజేశారు. భారత యువ బ్యాటర్ ప్రతీక రావల్ కి మాత్రం మెడల్ దక్కలేదు. గాయం కారణంగా మహిళల ప్రపంచ కప్ చివరి 2 మ్యాచ్ లకు ప్రతీకా రావల్ దూరమైన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో స్క్వాడ్ లోకి షెఫాలీ వర్మ రావడంతో ప్రతీకకు మెడల్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ జైషా చొరవ తీసుకున్నారు. “మెడల్ అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్టు జైషా నా మేనేజర్ కి మెసేజ్ చేశారు. తరువాత మెడల్ వచ్చేసింది. తొలిసారి దానిని చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు” అని ప్రతీక చెప్పారు.
ముఖ్యంగా ప్రతీక రావల్ 6 ఇన్నింగ్స్ లో కలిపి 308 పరుగులు రాబట్టింది. ప్రతీక ఖాతాలో ఓ సెంచరీ చేశారు. ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ కి ముందు ప్రతీక గాయపడింది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్ జరిగిన నామమాత్రపు మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆమె చీలమండకు గాయమైంది. ప్రతీక స్థానంలో లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. ఆసీస్ తో సెమీస్ లో తేలిపోయినా.. సౌతాఫ్రికా తో జరిగిన ఫైనల్ లో మాత్రం షఫాలీ సత్తా చాటింది. ఓపెనింగ్ బ్యాటర్ ఏకంగా 87 పరుగులు రాబట్టంతో పాటు రెండు వికెట్లు తీసి సత్తా చాటింది. ప్రతీకా స్థానంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నది షఫాలీ.భారత్ సౌతాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన తరువాత వీల్ చైర్ లో ప్రతీకా మైదానానికి వచ్చి.. సహచరులతో కలిసి సంబురాలు జరుపుకొంది. అప్పుడు ఆమెకు మెడల్ దక్కలేదు. కానీ ప్రధాని నరేంద్ర మోడీతో వరల్డ్ కప్ విజేత జట్టు సమావేశమైన సందర్భంగా ప్రతీక మెడలో పతకం కనిపించింది. అదే సమయంలో అమన్ జోత్ కౌర్ మెడల్ లేకుండా కనిపించింది. ఆమె ప్రతీకాకు మెడల్ అందజేసిందని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ మెడల్ పై ప్రతీకా స్పందించింది.
“ఆరోజు అమన్ జోత్ మెడల్ ఎందుకు వేసుకోలేదో నాకు తెలియదు. బహుశా తను మరిచిపోయి ఉంటుంది. సహాయక సిబ్బంది తన మెడల్ ను నాకు ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే..? త్వరలోనే నా మెడల్ నా దగ్గరకు చేరనుంది. ఈ విషయం గురించి ఐసీసీ చైర్మన్ జైషా మా మేనేజర్ కి సందేశం పంపించారు. ప్రతీకాకు పతకం వచ్చేలా తాను ఏర్పాట్లు చేస్తున్నానని మెసేజ్ చేశారు. నాకు త్వరలోనే మెడల్ లభిస్తుందని.. ఏది ఏమైనా స్టాప్ నాకు మెడల్ ఇవ్వగానే ఏడ్చాను. సాధారణంగా నేను ఎమోషనల్ అవ్వను. కానీ ఈసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాను. ఐసీసీ నాకు మెడల్ పంపగలదా..? అని జైషా అక్కడి వారిని అడిగారు. పతకం నా చేతికి రావడానికి కాస్త సమయం పడుతుంది. ప్రధాని దగ్గరకు వెల్లినప్పుడు పతకం లేదనే బెంగ లేకుండా సహాయక సిబ్బంది తన మెడల్ ను నాకు ఇచ్చారు” అని ప్రతీక రావల్ చెప్పుకొచ్చింది.
Also Read : Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా