Womens World Cup 2029: ఐసీసీ వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( WOMENS WORLD CUP 2025) ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టి ఛాంపియన్ గా నిలిచింది. 1973 నుంచి ఈ వన్డే వరల్డ్ కప్ కోసం మహిళల జట్టు కసిగా ఆడింది. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur) కెప్టెన్సీలోనే మొన్న ఐసీసీ వరల్డ్ కప్ గెలుచుకుంది టీమిండియా. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే మహిళల మండే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ పూర్తయి వారం రోజులు కాలేదు అంతలోనే ఐసీసీ మరో కీలక ప్రకటన చేసిందట. మహిళల వన్డే వరల్డ్ కప్ 2029 ( WOMENS WORLD CUP 2029) టోర్నమెంటులో మరో రెండు జట్లను పెంచే యోచనలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ 2029 సంవత్సరంలో జరగనుంది. వచ్చే వరల్డ్ కప్ ఏ దేశంలో జరుగుతుందనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే మొన్నటి వరల్డ్ కప్ శ్రీలంకతో పాటు ఇండియాలో జరిగింది కాబట్టి… వచ్చే వరల్డ్ కప్ విదేశాల్లోనే జరుగుతుంది. అయితే 2029 వరల్డ్ కప్ నేపథ్యంలో మరో రెండు జట్లను యాడ్ చేసేందుకు ఐసీసీ నిర్ణయం తీసుకుందట. ఇప్పటి వరకు ఎనిమిది జట్లు మాత్రమే వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. మరో రెండు జట్లను పరిగణలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారట. 2029 సమయానికి ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం ఆ రెండు జట్లను సెలెక్ట్ చేస్తారట. ఇక వచ్చే వరల్డ్ కప్ 2029 నేపథ్యంలో ఇప్పటికే ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, అలాగే శ్రీలంక క్వాలిఫై అయ్యాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు క్వాలిఫై కావాల్సి ఉంది. 2029 సమయానికి ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం మిగిలిన జట్లను ఫైనల్ చేస్తారు.
వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( WOMENS WORLD CUP 2025) విజేతగా టీమిండియా గెలిచింది. దక్షిణాఫ్రికాపై ఫైనల్స్ లో 52 పరుగల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ముంబై వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది టీమిండియా ( India Women vs South Africa Women). ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 298 పరుగులు సాధించింది టీమిండియా. ఇక లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించే క్రమంలో విఫలమైంది. 45.3 ఓవర్లలోనే 246 పరుగులకు కుప్పకూలింది. దీంతో టీమిండియాకు భారీ నజరానా ప్రకటించింది ఐసీసీ. ఏకంగా రూ.40 కోట్లు టీమిండియాకు ఐసీసీ (ICC) ద్వారా దక్కాయి. అటు భారత క్రికెట్ నియంత్రణ మండలికి ( Bcci)నజరానా ఇచ్చింది. రూ.51 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం అయింది.
Also Read: Cm Revanth Reddy: హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా తరహాలో బౌన్సీ పిచ్ లు
🚨 WOMEN’S WORLD CUP EXPANDED 🚨
– The ICC has expanded the Women’s World Cup from 8 to 10 teams for 2029 👏🏻
Qualified Teams for 2029 :
India 🇮🇳
Australia 🇦🇺
South Africa 🇿🇦
England 🏴
New Zealand 🇳🇿
Sri Lanka 🇱🇰– What's your take 🤔pic.twitter.com/M4dVomJexz
— Richard Kettleborough (@RichKettle07) November 8, 2025