E-Paper
Advertisement

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం
Advertisement

Fire Accident: శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని బెంగాలీ బస్తి అనే స్లమ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం గురించి రాత్రి 10:56 గంటల సమయంలో ఢిల్లీ అగ్నిమాపక సేవల శాఖకు సమాచారం అందింది. అగ్నిప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో, తక్షణమే 15 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. తర్వాత మంటలు ఎక్కువగా విస్తరించే ప్రమాదం ఉండటంతో మరో 14 యంత్రాలు కూడా చేరాయి.. దీంతో మొత్తం 29 యంత్రాలు పనిచేశాయి. అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు కష్టపడి, శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో అగ్నిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే ఈ ప్రాంతం రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక దట్టమైన స్లమ్ క్లస్టర్, ఇక్కడ వందలాది మంది కూలీలు, పేదలు తాత్కాలిక గుడిసెలు నిర్మించుకుని నివసిస్తున్నారు. అయితే ప్రస్తుతం అగ్ని వేగంగా వ్యాపించడానికి కారణం, ప్రమాద స్థలంలో ఉన్న అనేక LPG సిలిండర్లు కారణమంటున్నారు. ఈ పేలుళ్లు అగ్నిని మరింత తీవ్రతరం చేసి, పొగలు దట్టంగా ఏర్పడటానికి, నివాసుల్లో భయం వ్యాపించడానికి దారితీశాయి. నివాసులు తమ వస్తువులు కాపాడుకునేందుకు, భద్రతయుతంగా తరలి వెళ్లేందుకు గందరగోళంగా పరిగెత్తారు.

Advertisement

ఈ ఘటనలో ఒకరు మరణించారు. మృతుడు మున్నా(30)గా గుర్తించారు. అయితే ఈ వ్యక్తి శవం ఆహార గుడిసెలో కనిపెట్టారు. ఇక ఒక 5 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు, అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించబడ్డాడు. బాలుడి పరిస్థితి స్థిరంగా ఉందని, మరిన్ని మరణాలు లేదా గాయాలు రిపోర్ట్ కాలేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఘటన స్థలాంలో ఎక్కువగా జనాలు సమీపించకుండా చూస్తున్నారు.

Also Read: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు 

Advertisement

ఈ ఘటనలో ప్రాణ నష్టం తక్కువగా సంభవించిని ఆస్తి నష్టం భారీగా జరిగింది. 500 గుడిసెల వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయి, ఇందులో వందలాది కుటుంబాలు తమ ఇళ్లు, సామానులు కోల్పోయారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఎక్కువగా బెంగాలీ మూలాల కార్మికులు, వారి ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి. అగ్నిప్రమాద కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు, కానీ LPG సిలిండర్ల పేలుళ్లు ముఖ్య కారణంగా చెబుతున్నారు.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×