Preity Zinta Cute: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ క్వాలిఫైయర్ 2వ మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించిన పంజాబ్ కింగ్స్… నేరుగా ఫైనల్స్ కు దూసుకు వెళ్ళింది. ఇలా పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి వెళ్లడం… 11 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇప్పటివరకు టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్… ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలని కసితో ఉంది. దీనికి తగ్గట్టుగానే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించి మరి… ప్రీతి జింటాకు గ్రాండ్ విక్టరీ అందించాడు శ్రేయస్ అయ్యర్.
Also Read: Priyansh Arya football: వాళ్ళు తన్నడం, వీడు తన్నించుకోవడం…అందరూ సరిపోయారు.. పిల్ల బచ్చాను చేసి
కన్ను గీటిన ప్రీతి జింటా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు చేరిన నేపథ్యంలో.. ఆ జట్టు ఓనర్ ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో రచ్చ చేసింది ప్రీతిజింటా. అంతే కాదు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ వధేరా ను కన్ను గీటింది ప్రీతి జింటా. ఐదు పదుల వయసులో కూడా… చాలా అందంగా కనిపిస్తూ.. నిన్నటి మ్యాచ్ లో రచ్చ చేసింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ పైన గెలిచిన తర్వాత ఆమె ఎగిరి గంతేసిన పని చేసింది. మైదానంలో తిరుగుతూ సందడి కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె కన్ను కొట్టిన వీడియో మాత్రం వైరల్ గా మారింది.
ఒంటి చేత్తో జట్టును గెలిపించిన శ్రేయస్ అయ్యర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఆదివారం రోజున జరిగిన క్వాలిఫైయర్ రెండో మ్యాచ్ లో దుమ్ము లేపాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. తన కెప్టెన్సీ అలాగే బ్యాటింగ్లో అదరగొట్టాడు ఈ కుర్రాడు. ఈ దెబ్బకు 11 సంవత్సరాల తర్వాత ఫైనల్ కు దూసుకు వెళ్ళింది పంజాబ్ కింగ్స్. తాను తీసుకుంటున్న 26 కోట్లకు… శ్రేయస్ అయ్యర్ న్యాయం చేస్తున్నాడని… అందరూ జోరుగా చర్చించుకుంటున్నారు. బ్యాటర్ అంటే ఇలా ఉండాలని.. ఇలాంటోడు టీమిండియాలో ఉండడం కచ్చితంగా అవసరమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజ్ బెంగుళూరు చేతిలో దారుణంగా ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. ఆ సమయంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒకే ఒక పరుగు చేసే అవుట్ అయ్యాడు. కానీ నిన్న ముంబై పోయిన జరిగిన మ్యాచ్లో మాత్రం 87 పరుగులు చేసి.. జట్టుకే కాదు ప్రీతి జింటాకు కూడా ఊపిరి పోసాడు. 11 సంవత్సరాల… నిరీక్షణ తర్వాత ఫైనల్ కు పంజాబ్ కింగ్స్ జట్టును చేర్చాడు. మరొక్క అడుగు వేస్తే పంజాబ్ కింగ్స్ చాంపియన్గా మారడం పక్కా అని తెలుస్తోంది.
Cutie Preity Zinta pic.twitter.com/TQccKFiMtm
— Narवीर 🥗☕🏋🏻 (@LTEorNR) June 1, 2025