Priyansh Arya football: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఆదివారం రోజున క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఫైట్ జరుగుతోంది. ఇందులో మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ప్రతి ఓవర్ కు 10 పరుగులు వచ్చేలా ప్లాన్ చేస్తోంది. నిర్ణీత 20 ఓవర్స్ లో… 200 కు పైగా పరుగులు చేసేలా కనిపిస్తోంది ముంబై ఇండియన్స్.
వర్షంతో భారీ మ్యాచ్ కు భారీ అడ్డంకి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్… బౌలింగ్ తీసుకుంది. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు వచ్చే కంటే ముందు… ఊహించని పరిణామం ఎదురైంది. భారీ వర్షం అహ్మదాబాద్ స్టేడియంలో పడింది. గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ లో కూడా.. భారీ వర్షం పడింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో దాదాపు రెండు గంటల మ్యాచ్ ఆగిపోయింది. చాలా ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆగిపోయిన సమయంలో… పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు ఫుట్ బాల్ ఆడారు.
ప్రియాన్ష్ ఆర్య ను ఫుట్బాల్ ఆడుకుంటున్న పంజాబ్ ప్లేయర్లు
ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో వర్షం పడింది. అయితే వర్షం పడిన సమయంలో పంజాబ్ ప్లేయర్లు ఫుట్ బాల్ ఆడారు. సాధారణంగా ఫుడ్ బాల్ ఆడితే… పెద్ద వార్త కాకపోవును. కానీ…. ప్రియాన్ష్ ఆర్యను… గోల్ కీపర్ గా పెట్టి మరి ఫుట్ బాల్ ఆడారు పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు. అది కూడా గోల్ కీపర్ గా ఉన్న ప్రియాన్ష్ ఆర్య… తన బ్యాక్ సైడ్ చూపిస్తూ.. ఆడడం జరిగింది. దీంతో మిగతా ప్లేయర్లు అతని ప్రైవేట్ పార్ట్ కు తగిలేలా… ఫుట్ బాల్ ఆడారు. కానీ ఒక్క ప్లేయర్ కూడా అసలు గోల్.. కొట్టలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా…. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ కి వెళ్తుంది. ముంబై ఇండియన్స్ కనుక… ఫైనల్ కి వెళ్ళితే… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడం అసాధ్యమని కూడా ఇప్పుడే… చర్చ మొదలైంది.
Also Read: PBKS vs MI Qualifier 2 : మోడీ స్టేడియంలో భారీ వర్షం.. సంబరాల్లో RCB, ఆందోళనలో అంబానీ ఫ్యామిలీ
look at my beautiful team 😭😭😭 pic.twitter.com/mbUUTDoBe8
— tak 🍉 (@_takila_) June 1, 2025