BigTV English

Film industry: లక్ అంటే నీదేనయ్యా… ఈ హీరో కోసం పడిచస్తున్న హీరోయిన్స్.. నిన్న ఆలియా… నేడు త్రిష

Film industry: లక్ అంటే నీదేనయ్యా… ఈ హీరో కోసం పడిచస్తున్న హీరోయిన్స్.. నిన్న ఆలియా… నేడు త్రిష

Film industry..నటులుగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులనే కాదు సినీ సెలబ్రిటీలను కూడా మెప్పించిన అతి తక్కువ మంది సెలబ్రిటీలు మనకు ఇండస్ట్రీలో తారస పడుతూనే ఉంటారు. అలాంటి నటుల సినిమాలను చూడడానికి ఆడియన్స్ ఎంతలా అయితే ఆరాటపడతారో.. ఆ నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తోటి నటీనటులు కూడా అంతే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఒక నటుడిపై ఏకంగా స్టార్ హీరోయిన్లు మనసు పారేసుకుంటూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు ఈ విషయం తెలిసి నెటిజన్స్ కూడా కూడా లక్ అంటే నీదేనయ్యా.. నీకోసం ఆ స్టార్ హీరోయిన్స్ కూడా పడి చస్తున్నారు.. అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఆ స్టార్ హీరో కోసం కోలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎదురుచూస్తూ.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అతనితో ఒక్క అవకాశం వస్తే చాలు అంటూ పడి చచ్చిపోతున్నారు. మరి ఆ హీరో ఎవరు? ఆయన కోసం అంతలా పరితపించపోతున్న ఆ హీరోయిన్స్ ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


ఫహద్ ఫాజిల్ తో ఒక్క ఛాన్స్ అంటున్న ఆలియా..

ఆయన ఎవరో కాదు ప్రముఖ మాలీవుడ్ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahad Fazil). తన విలక్షణమైన నటనతో ఆడియన్స్ నే కాదు సెలబ్రిటీలను సైతం మెప్పిస్తున్నారు. ఎలాంటి పాత్రలోనైనా సరే పరకాయ ప్రవేశం చేసి, సినిమాను కూడా తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించగల టాలెంట్ ఉన్న వ్యక్తి ఈయన. ఒక అద్భుతమైన యాక్టర్ అని ఈయనతో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు హీరోయిన్లు చెబుతున్నారు. అందులో భాగంగానే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) తనకు ఫహద్ ఫాజిల్ అంటే ఇష్టమని, అతనితో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోనని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఆయన నటించిన ‘ఆవేశం’ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ఒక గొప్ప నటుడని, ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని అటు దర్శక నిర్మాతలను కూడా వేడుకుంది ఈ ముద్దుగుమ్మ.


also read : Singer Chinmayi:అస్సలు ఊరుకును… కోర్టుకు వెళ్తా… తన వివాదంపై సింగర్ చిన్మయి రియాక్షన్!

ఆలియా మాత్రమే కాదండోయ్ త్రిష కూడా..

ఇప్పుడు తాజాగా హీరోయిన్ త్రిష (Trisha Krishnan) కూడా ఫహద్ ఫాజిల్ అంటే ఇష్టమని, అతనితో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అసలు విషయంలోకి వెళ్తే.. 38 ఏళ్ల తర్వాత కమలహాసన్ (Kamal Haasan), మణిరత్నం(Maniratnam) కాంబినేషన్లో ‘థగ్ లైఫ్’ సినిమా వస్తోంది. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొంటున్న త్రిష.. తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. ఫహద్ ఫాజిల్ అంటే ఇష్టమని, ఆయనతో కలిసి నటించడం తనకు చాలా ఇష్టమని తెలిపింది. మొత్తానికి అయితే ఫహద్ ఫాజిల్ తో కలిసి నటించడం కోసం ఈ హీరోయిన్స్ తెగ ఆసక్తి కనబరుస్తూ ఉండడం గమనార్హం. మరి వీరందరూ కోరుకుంటున్నట్లు ఫహద్ ఫాజిల్ తో కలిసి నటించే అవకాశం వస్తుందో లేదో చూడాలి.

Related News

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Big Stories

×