E-Paper
Advertisement

T20 World Cup 2024 Final: జయహో భారత్.. రోహిత్ సేనాకు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసలు

T20 World Cup 2024 Final: జయహో భారత్.. రోహిత్ సేనాకు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసలు
Advertisement

Political Leaders Congratulates Team India On Majestic Win In WC 2024 Finals: టీ 20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా టీమ్ ఇండియా గెలిచింది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను ఓడించి.. ట్రోఫీని ముద్దాడింది. కోట్లాదిమంది భారతీయులకు అపరిమితమైన సంతోషాన్ని ఇచ్చింది. వారి మనసులను ఉప్పొంగేలా చేసింది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ సేనాకు పలవురు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

ఉత్కంఠపోరులో రోహిత్ సేనా టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మ్యాచ్ తో పాటు హృదయాలను గెలిచారని మోదీ కొనియాడారు.

Advertisement

రాష్ట్రపతి ద్రైపది ముర్ము, విపక్షనేత రాహుల్ గాంధీ, టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు రాహుల్ గాంధీ.. అదో బ్రిలియంట్ క్యాచ్ అని మ్యాచ్ ను మలుపు తిప్పిన క్యాచ్ అని అన్నారు. ఇక కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మను రాహుల్ గాంధీ ఆకాశానికి ఎత్తేశారు. రోహిత్ గ్వైడెన్స్ ను టీమ్ ఇండియా చాలా ఫార్మాట్ లలో మిస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి భారత్ గర్వపడేలా చేశారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Advertisement

ఇక టీమ్ ఇండియాకు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించిన తీరు అభినందనీయం అని తెలిపారు. వరల్డ్ కప్ ను గెలవడం ద్వారా టీమ్ ఇండియా దేశ ప్రజలను గర్వించేలా చేసిందన్నారు సీఎం. ఈ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ప్రంపంచ క్రికెట్ లో భారత్ కు ఎదురులేదని మరో సారి నిరూపించందని రేవంత్ రెడ్డి కొనియాడారు.

Also Read: హై ఓల్టేజ్ ఫైనల్ లో జయం మనదే.. టీ 20 ప్రపంచకప్ విజేతగా టీమ్ ఇండియా

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నెగ్గడంతో టీమ్ ఇండియా చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ కలను రోహిత్‌సేనా సాకారం చేసిందన్నారు. దేశాన్ని ఆనందోత్సవాల్లో ముంచెత్తినందుకు టీమ్ ఇండియాకు కృతఙ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు. భారత ఖ్యాతిని మరింత పెంచారని కొనియాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి హరీశ్ రావు, సినీ హీరో మంచు విష్ణు అభినందనలు తెలియజేశారు. ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. సమిష్ట కృషితో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించిందన్నారు.

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×