Rahmanullah Gurbaz Injury: వెస్టిండీస్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan vs West Indies) మధ్య నిన్నటితో టి20 సిరీస్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ 300 టి20 సిరీస్ ను 2-1 తేడాతో ఆఫ్ఘనిస్తాన్ గెలుచుకుంది. ఈ టి20 టోర్నమెంటు దుబాయ్ వేదికగా జరిగింది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మూడవ టి20 లో మాత్రం కరేబియన్లు విజయం సాధించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మూడవ టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ 15 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ డేంజర్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ గాయం ( Rahmanullah Gurbaz injury) బారిన పడ్డాడు. ఓ ఫీల్డర్ విసిరిన బంతి రహ్మానుల్లా గుర్బాజ్ మెడకు గట్టిగా తగిలింది. దీంతో అక్కడే రహ్మానుల్లా గుర్బాజ్ ( Rahmanullah Gurbaz) కుప్పకూలాడు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
వెస్టిండీస్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన మూడవ టి20లో రహ్మానుల్లా గుర్బాజ్ 71 పరుగులతో రాణించాడు. 58 బంతుల్లో 71 పరుగులు సాధించిన రహ్మానుల్లా గుర్బాజ్, ఒక సిక్సర్ తో పాటు ఎనిమిది బౌండరీలు సాధించాడు. అయినప్పటికీ ఆఫ్గనిస్తాన్ ఓడిపోయింది. అయితే రహ్మానుల్లా గుర్బాజ్ 50 పరుగులు చేసిన తర్వాత ఓ సింగిల్ కు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా వెస్టిండీస్ ఫీల్డర్ త్రో విసిరాడు. అయితే ఆ బంతి రహ్మానుల్లా గుర్బాజ్ మెడకు తగిలింది. దీంతో గ్రౌండ్ లోనే కుప్పకూలాడు రహ్మానుల్లా గుర్బాజ్. ఆ బంతి తగలడంతో రహ్మానుల్లా గుర్బాజ్ మెడకు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఫిజీషియన్లు రంగంలోకి దిగారు. అనంతరం రహ్మానుల్లా గుర్బాజ్ కు ప్రథమ చికిత్స కూడా అందించారు. ఆ గాయానికి వెంటనే రిటైర్డ్ ఔట్ కావాలి. కానీ మనోడు మ్యాచ్ కోసం ప్రాణాలు తెగించి ఆడాడు. కానీ 71 పరుగుల వద్ద రహ్మానుల్లా గుర్బాజ్ వికెట్ కోల్పోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది.
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ( Ms Dhoni ) అంటే తనకు ఎంతో ఇష్టమని.. అతని వల్లే తాను వికెట్ కీపర్ గా మారినట్లు వివరించారు. అతని నేరుగా కలిసే అవకాశం నాకు రాలేదని ఎమోషనల్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగా చాలా మంది ప్లేయర్లను కలిసినట్లు పేర్కొన్నారు. దీంతో రహ్మానుల్లా గుర్బాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అదే స్ఫూర్తితో కూడా నిన్న వెస్టిండీస్ పై రహ్మానుల్లా గుర్బాజ్ బ్యాటింగ్ చేసినట్లు తెలుస్తోంది.
?igsh=a3FjNWNuaWV6aTgx
Gurbaz was struck on the face while backing up for a quick single. A throw at the bowler’s end missed, the ball deflected off the pitch and hit him on the face. He fell to the ground in pain as his helmet came off.
Thank God he’s fine and up on his feet again.#AFGvWI… pic.twitter.com/HTk47AtPqG— Bashir Gharwal غروال (@bashir_gharwall) January 22, 2026