RCB VS DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 30% మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో శనివారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Royal Challengers Bengaluru vs Delhi Capitals) మధ్య 26వ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ ( Rajat Patidar ) చేసిన ఒకే ఒక్క తప్పిదం కారణంగా ఆ జట్టు దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది. డేవిడ్ మిల్లర్ రనౌట్ అయ్యే ఛాన్స్ ను చేతులారా పోగొట్టుకున్నాడు రజత్ పటిదార్. అయితే ఈ రనౌట్ మిస్ ( Rajat Patidar Run out miss) అయిన నేపథ్యంలో చివరి ఓవర్ లో రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిపించాడు డేవిడ్ మిల్లర్ ( David Miller). ఈ క్రమంలో డేంజర్ గా మారిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సంఘటనకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.
Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖరీదైనవా ? ఆ డబ్బులతో 4 SUV కార్లు కొనచ్చు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో శనివారం రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన బెంగళూరు, ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. ఫిలిప్ సాల్ట్ ఒక్కడే 63 పరుగులు చేయగా టిమ్ డేవిడ్ 26 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇక ఈ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి చేదించింది ఢిల్లీ క్యాపిటల్స్.
KL రాహుల్ 57 పరుగులతో రాణించగా స్టబ్స్ 60 పరుగులతో ఇరగదీశాడు. చివరలో డేవిడ్ మిల్లర్ 10 బంతుల్లో 22 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్ చివరలో డేవిడ్ మిల్లర్ ను ( DAvid Miller) రన్ అవుట్ చేసే అవకాశం రాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ చేజేతులా మిస్ చేశాడు. అక్కడే మిల్లర్ ను ఔట్ చేసి ఉంటే బెంగళూరు విజయం సాధించేది. రనౌట్ మిస్ అయిన తర్వాత రెండు సిక్సర్లు చివరలో కొట్టి మ్యాచ్ గెలిపించాడు డేవిడ్ మిల్లర్. దీంతో ఇప్పుడు రజత్ పాటిదర్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: SRH జట్టులో చీలిక.. తెలంగాణ, ఏపీ ఫ్యాన్స్ మధ్య కొత్త పంచాయితీ..తలపట్టుకున్న కావ్య పాప
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==