Rashid Latif: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ( Rashid Latif) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా డీఎన్ఏ లోనే ( DNA) గెలుపు ఉంటుందని… పాకిస్తాన్ DNA లో మాత్రం ఎప్పుడూ ఓడిపోవాలని ఆతృత తప్ప ఇంకేం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే టీమిండియా వరుసగా ట్రోఫీలు దక్కించుకుంటోందని, అదే సమయంలో పాకిస్తాన్ ఓడిపోతుందని చురకలు అంటించారు రషీద్ లతీఫ్. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) టీం ఇండియా ( Team India) ఛాంపియన్ గా నిలిచిన నేపథ్యంలో రషీద్ లతీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Boycott SRH: బాయ్ కాట్ సన్ రైజర్స్ అంటూ ట్రోలింగ్..పాకిస్తాన్ ప్లేయర్లను కొనడంపై వివాదం
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 2007 సంవత్సరంలో జరిగిన టోర్నమెంట్లో ఇండియా తొలి టైటిల్ గెల్చుకోగా, 2024లో మరో టైటిల్ అందుకుంది. ఇక మొన్న సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ముచ్చటగా మూడవసారి ఛాంపియన్ గా నిలిచింది ఇండియా. అయితే అటు ఏషియా కప్ 2025, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్స్ లో కూడా ఇండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ స్పందించారు. టీమిండియా డిఎన్ఏ లోనే విజయం ఉంటుందని.. వాళ్లు అందుకే ట్రోఫీలను గెలుస్తూ పోతున్నారని వెల్లడించారు. అదే పాకిస్తాన్ డిఎన్ఏలో ( DNA) ఎప్పుడు ఓటమి రాసిపెట్టి ఉంటుందని చురకలు అంటించారు. అందుకే బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్ల చేతిలో కూడా పాకిస్తాన్ ఓడిపోతోందని మండిపడ్డారు.
టీమిండియా ( Team India) విజయం రాత్రికి రాత్రి వచ్చినది కాదని వ్యాఖ్యానించారు రషీద్ లతీఫ్ ( Rashid latif). దాదాపు పది సంవత్సరాలుగా వాళ్లు కఠినమైన శ్రమ అలాగే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. దానివల్ల టీమిండియా ప్రతి టోర్నమెంట్ లో అద్భుతంగా రానించి విజయం సాధిస్తుందని వివరించారు. టీమిండియా టాస్ ఓడిపోయిన కూడా ప్రతి మ్యాచ్ లో 250 కి పైగా పరుగులు సాధించడం గొప్ప విషయమని వెల్లడించారు రషీద్ లతీఫ్. ఇక టీమ్ ఇండియాతో మ్యాచ్ ఆడేటప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లు గజ గజ వణికిపోతున్నారని బాంబు పేల్చారు. మైదానంలో ప్రశాంతంగా ఆడితేనే విజయం సాధిస్తారని… కానీ టీమిండియాతో ( Team India) మ్యాచ్ అంటేనే మా వాళ్లు వణికి పోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రషీద్ లతీఫ్. అందుకే టీమిండియా చేతిలో ప్రతిసారి పాకిస్తాన్ ( Pakistan Team ) ఓడిపోతుందని బాంబు పేల్చారు. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం జరుగుతోన్న వన్డే సిరీస్ లో కూడా పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయిందని మండిపడ్డారు.
Also Read: Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్నర్ ఎవరో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అతనికే
🚨 BIG STATEMENT BY RASHID LATIF ON INDIA AND PAKISTAN DNA 🚨
Rashid Latif 🗣️ – “Playing finals and winning the World Cup is in India’s DNA. For Pakistan's DNA, we play and then lose in the knockout and return home early." 😆
What's your take 😅pic.twitter.com/vpubJTHDx9
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 12, 2026