E-Paper
Advertisement

తిలక్ వర్మ హీరో కాదు, జీరో…బంతుల‌న్ని మింగాడు

తిలక్ వర్మ హీరో కాదు, జీరో…బంతుల‌న్ని మింగాడు
Advertisement

Ravi Shastri On Tilak Varma:  టీమిడియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టి20 సందర్భంగా తిలక్ వర్మ పేరు మారుమోగుతోంది. నిన్నటి మ్యాచ్ లో అర్థ సెంచరీ చేసి గెలిపించిన క్రమంలో ఈ తెలుగోడిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. పాకిస్తాన్ మాజీలు కూడా అతన్ని మెచ్చుకుంటున్నారు. మరో విరాట్ కోహ్లీ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. తిలక్ వర్మ హీరో కాదని.. వాడు పెద్ద జీరో అంటూ బాంబు పేల్చారు. చేజింగ్ చేస్తున్న క్రమంలో చివరలో బాగా ఆడినప్పటికీ… మొదట్లో బంతులు అన్ని మింగాడని ఫైర్ అయ్యారు. నమన్ ధీర్ పైన తీవ్ర ఒత్తిడి పెంచి… సినిమా చూశాడని ఆగ్రహించారు. ఈ మ్యాచ్ లో నవన్ ధీర్ అసలైన హీరో అంటూ పేర్కొన్నారు రవి శాస్త్రి. దీంతో తిలక్ వర్మ ప్రదర్శన పై రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రవి శాస్త్రి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి?

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20 సందర్భంగా చాలా కష్టపడే టీమ్ ఇండియా విజయం సాధించింది. ప్లేయర్లు ఒత్తిడికి గురి కావడంతో చివరి బంతి వరకు మ్యాచ్ వెళ్ళింది. ఓపెనర్లు సంజు, అభిషేక్ శ‌ర్మ‌ విఫలం కావడం.. మిడిల్ ఆర్డర్ లో వైభవ్, శ్రేయస్ అయ్యర్ తేలిపోవడంతో భారం అంతా తిలక్ వర్మ, నవన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డిల పైన పడింది. అయితే తిలక్ వర్మ మొదట్లో కాస్త స్లోగా ఆడి.. సిక్సర్లు కొట్టాలని న‌మన్ ధీర్ పై ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 17 బంతుల్లో 31 పరుగులు సాధించాడు నమన్. ఇందులో మూడు సిక్సుల‌తో పాటు ఓ బౌండరీ కూడా ఉంది. వేగంగా ఆడే క్రమంలో అతడు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా భయంకరంగా బ్యాటింగ్ చేశాడు. అయితే మొదట్లో స్లోగా తిలక్ వర్మ బ్యాటింగ్ చేసిన క్రమంలో చివరలో ప్లేయర్లపై ఒత్తిడి బాగా పెరిగింది. ఆ త‌ర్వాత గేర్ మార్చి వేగంగా ఆడాడు తిలక్ వర్మ. మొద‌టిలాగే చివ‌ర‌లోనూ స్లోగా ఆడి ఉంటే మ్యాచ్ ఓడిపోయేది. ఈ క్రమంలోనే రవి శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు నుంచి అటాకింగ్ బ్యాటింగ్ చేసి ఉంటే… నమన్ ధీర్, తిలక్ వర్మ మ్యాచ్ ఫినిష్ చేసే వాళ్ళని పేర్కొన్నారు. న‌మ‌న్ ధీర్ ఫాస్ట్ గా బ్యాటింగ్ చేసిన క్రమంలో టీమిండియా గెలవ గలిగిందని.. అతడే వేగంగా ఆడకపోయి ఉంటే కచ్చితంగా ఓడిపోయేదని స్పష్టం చేశారు. తన దృష్టిలో రెండో టీ20 రియల్ హీరో న‌మ‌న్ ధీర్‌ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

Related News

తిల‌క్ వ‌ర్మ‌ కాళ్లు క‌డిగి నెత్తిన పోసుకోండి…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

ఒరేయ్ రెడ్డి..? నితీశ్ కుమార్‌ను బూతులు తిట్టిన తిలక్ వర్మ !

ర‌వీంద్ర జ‌డేజా వ‌ల్లే, నా కెరీర్ నాశ‌నమైంది…చీఫ్ సెల‌క్ట‌ర్ ఓజా సంచ‌ల‌నం !

రెండో టీ20లోనూ టీమిండియా విజయం…వైభవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై ట్రోల్స్

సిక్సులు కొట్ట‌డం బాబ‌ర్ ద‌గ్గ‌ర నేర్చుకో…వైభ‌వ్ పై త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

PSL షాకింగ్ డిమాండ్స్..రోడ్డున ప‌డ‌నున్న పాకిస్తాన్ ప్లేయ‌ర్లు !

వైభ‌వ్ ను బూతులు తిట్టిన అభిషేక్ శ‌ర్మ‌…ఈ బుడ్డోడితో ఆడ‌లేనంటూ గొడ‌వ !

Big Stories

Advertisement
×